Search
Friday 16 November 2018
  • :
  • :

డిఫరెంట్ స్టైల్లో సుధీర్‌బాబు

Sudheer-babu

సుధీర్‌బాబు, వామిఖ హీరోహీరోయిన్లుగా 70ఎంఎం ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్‌కుమార్‌రెడ్డి ,శశిధర్‌రెడ్డిలు సంయుక్తగా శ్రీరామ్ ఆదిత్యని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘భలే మంచి రోజు’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ “సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘భలే మంచి రోజు’ మొదటి పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆతర్వాత వినాయక చవితి సందర్భంగా రెండవ పోస్టర్‌ను విడుదల చేశారు. మొదటి పోస్టర్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా లవ్‌లీగా, ఎనర్జీగా ఉందటూ అందరూ ప్రశంసించారు. సినిమా రెండు పోస్టర్స్‌లో సుధీర్‌బాబు చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నాడు. కాస్టూమ్స్, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్… ఇలా అన్నింట్లోనూ చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాడు. సుధీర్‌బాబు చిత్రాల్లో ఇదే బెస్ట్ స్టైలిష్ ఫిల్మ్ కానుంది”అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ “సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. ఈ నెలాఖరుతో షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేస్తాం. ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఒక్క రోజులో జరిగే కథనంతో, ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోదభరితంగా సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఉత్తమ విలన్, విశ్వరూపం 2 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించారు. సన్నీ యం.ఆర్ సంగీతమందించారు. సుధీర్‌బాబు కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంది”అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలుః అర్జున్, కార్తీక్, ఎడిటింగ్‌ః యం.ఆర్.వర్మ.

Comments

comments