Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

విభిన్న కోణంలో సుధీర్‌బాబు

Sudheeer-babu

విభిన్నమైన పాత్రలు, కథలతో మెప్పిస్తున్న సుధీర్‌బాబు ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఆర్.ఎస్.నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హీరో సుధీర్‌బాబును విభిన్నమైన కోణంలో చూపిస్తూ కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేష్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారు. ఈ చిత్రానికి ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః సురేష్ రగుతు, మ్యూజిక్‌ః అజనీష్ బి.లోకనాథ్, ఎడిటర్‌ః ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్‌ః శ్రీకాంత్ రామిశెట్టి.

Comments

comments