Search
Saturday 17 November 2018
  • :
  • :

సుధీర్‌బాబు చిత్రం ప్రారంభం

Sudheer Babu New Movie Shooting Start

హీరో సుధీర్‌బాబు కొత్త సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వి.వి. వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించగా దిల్‌రాజు క్లాప్ కొట్టారు. పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. పులివాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఖుర్షీద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వి.కె, పోసాని కృష్ణమురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటించే ఈ చిత్రానికి కెమెరామెన్‌ః పి.వి.శంకర్, సంగీతంః ఎస్. ఎస్.తమన్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః బ్రహ్మ కడలి.

Comments

comments