Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సహజ నటుడు సుధీర్

ParuchuriGopalaKrishnaసుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ సంయు క్తంగా నిర్మించిన చిత్రం ‘భలే మంచి రోజు’. ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన సినిమా విశేషాలు….
మెకానిక్ క్యారెక్టర్‌లో…
‘భలే మంచి రోజు’లో నేను మెకానిక్ క్యారెక్టర్ చేశాను. మా రెండో అన్నయ్య మెకానిక్‌గా పనిచేసేవారు. ఆయన్ని ఎంతో దగ్గరగా చూసిన నేను మెకానిక్ క్యారెక్టర్‌లో బాగా నటించగలిగాను. ఇండస్ట్రీలో మాకు రచయితలుగా అవకాశమిచ్చిన ఎన్టీఆర్, కృష్ణ మాకు రెండు కళ్లలాంటి వారు. కెరీర్ ప్రారంభంలో వారు మాకు 80 శాతం సినిమాల్లో అవకాశమిచ్చారు. అలాంటి కృష్ణ అల్లుడు సుధీర్‌బాబుకు సినిమాలో తండ్రిగా నటించడం హ్యాపీగా ఉంది.
నేటి తరం డైరెక్టర్ శ్రీరామ్ …
కృష్ణవంశీ తర్వాత నటీనటుల నుండి సహజమైన నటనను రాబట్టుకునే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. అలాగే నా నుంచి మంచి పర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నాడు శ్రీరామ్. అతను నేటి తరం డైరెక్టర్. సుధీర్‌బాబు సహజమైన నటుడు. ‘భలే మంచి రోజు’ చిత్రంతో అతని కథానాయకుడిగా మంచి పేరు వస్తుంది.
ఒక రోజు కథ…
సినిమా కథ విషయానికొస్తే ఏ పనిపాట లేకుండా తిరిగే యువకుడికి జరిగిన యాక్సిడెంట్ వల్ల అతనికి ఒక అందమైన అమ్మాయి తారసపడుతుంది. ఈ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కథే ఈ సినిమా.
సెన్సార్ నుండి ప్రశంసలు…
పుష్కలమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘భలే మంచి రోజు’ రూపుదిద్దుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. సినిమాలో నా పాత్రకు సెన్సార్ వారి నుండి కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం నా కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలుస్తుంది.
మంచి నిర్మాతలు…
సినిమాను అద్భుతంగా రూపొందించడంలో విజయ్‌కుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డిలు ఎక్కడా రాజీపడలేదు. చిత్రీకరణలో కూడా వారు ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఇలాంటి మంచి నిర్మాతలు నేడు ఇండస్ట్రీకి ఎంతో అవసరం.

Comments

comments