Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆఫీస్ మొత్తం భయపడే మేనేజర్

Sudheerbabu In Nannu Dochukunduvathe

సుధీర్‌బాబు హీరోగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం, హీరో, హీరోయిన్‌ల పర్‌ఫార్మెన్స్ ఫ్రెష్‌గా అనిపించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్‌గా సుధీర్‌బాబు నటించగా… అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ కనిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ “సమ్మోహనం వంటి మంచి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత సుధీర్‌బాబు నుంచి వస్తున్న చిత్రం కావడంతో  ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో ప్రమోషన్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాం. సుధీర్‌బాబు ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. సినిమా స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది”అని అన్నారు. హీరో, నిర్మాత సుధీర్‌బాబు మాట్లాడుతూ “దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ, స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించాడు. నా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటామన్న నమ్మకం ఉంది. హీరోయిన్ నభ నటేష్ చాలా బాగా నటించింది”అని తెలిపారు. నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్‌ః సురేష్ రగుతు, మ్యూజిక్‌ః అజనీష్ బి.లోకనాథ్, ఎడిటర్‌ః ఛోటా కె. ప్రసాద్, ఆర్ట్‌ః శ్రీకాంత్ రామిశెట్టి.

Comments

comments