Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నిర్మాతగా సుధీర్‌బాబు కొత్త అవతారం

sudheerbabu

సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “హీరోగా సుధీర్‌బాబు రాణించారు. ఇప్పుడు ఆయన స్థాపించిన సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “సుధీర్‌బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అతనిని 15 ఏళ్లుగా చూస్తున్నాను. ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. సుధీర్ సక్సెస్‌ఫుల్ నిర్మాత కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ “నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది. ఇక నా ప్రొడక్షన్‌లో చేస్తున్న సినిమా 80 శాతం పూర్తయింది. ఈ సినిమా వివరాలను త్వరలోనే తెలియజేస్తాను. చిత్ర పరిశ్రమలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఈ ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ సుంకర, సందీప్ కిషన్, లగడపాటి శ్రీధర్, శ్రీరామ్ ఆదిత్య, వంశీపైడిపల్లి, కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments