Home దునియా కథే హీరో…

కథే హీరో…

Sudigaali Sudheer

‘జబర్దస్త్’, ‘ఢీ’, ‘పోవే పోరా’ లాంటి షోలతో బుల్లితెరకు చేరువైన యాంకర్ సుడిగాలి సుధీర్. ఆయన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో ధన్యా బాలకృష్ణ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇప్పటి వరకూ ప్రేక్షకులు నన్ను తమ పక్కింటి కుర్రాడిగా పరిగణించారు. అది నిజంగా నా అదృష్టం’ అంటున్నాడు సుధీర్.

Sudigaali Sudheer as Hero in Software Sudheer Movie