Home తాజా వార్తలు జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మీడియాపై చిందులు

జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మీడియాపై చిందులు

హైదరాబాద్: సుడిగాలి సుధీర్ తెలుసు కదా మీకు. జబర్దస్త్ షోతో పాపులరటీ తెచ్చుకున్నాడు. చిన్న సంఘటనతో సుడిగాలి నానా హంగామా సృష్టించాడు. సుడిగాలి కారును పొరపాటునా వేరే వాళ్ల కారు ఢీ కొట్టింది. సుడిగాలి కారు ఆపి తిట్ల పురాణం మొదలు పెట్టాడు. ఇదంతా గమనించి మీడియా షూట్ చేస్తుంటే మరింత రెచ్చిపోయి మీడియా అయితే నాకేంటి అంటూ చిందులు వేశాడు. సుధీర్‌కు జబర్దస్త్ షోతో కళ్లు నెత్తిమీదకు వచ్చాయంటూ అక్కడి ఉన్న వారంతా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

https://youtu.be/5f4C7UA5Zzk