Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

షాకింగ్ న్యూస్ : జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ టీం ఔట్..!!?

Sudigali Sudheer Team out from Jabardasth Show

ఈటివిలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలుసు. తెలుగు టీవీ షోల్లోనే టాప్ రేటింగ్ సంపాదించుకున్న ఈ షో లో వివాదాలు కూడా ఎక్కువే.

చాలా మంది ఈ షోలో కామెడి కాకుండా మసాలా, డబల్ మీనింగ్ డైలాగ్ లు ఎక్కువయ్యాయని, ఈ షోను బ్యాన్ చేయాలని కూడా ఫిర్యాదులు చేశారు. ఇలా ఈ షో పై ముందు నుంచి ఏదో ఒక వివాదం వస్తుండేంది.

ఇప్పుడు ఈ షో లో ఇంకో వివాదం ప్రారంభమైందట. సడెన్ గా సుడిగాలి సుధీర్ టీం ను ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం నుంచి తీసేశాడట నాగబాబు. మార్చి 31 న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కు సంబంధించిన ప్రోమో ను చూస్తే ఈ విషయం ప్రస్ఫుటమౌతున్నది.

సుడిగాలి సుధీర్ స్కిట్ తో ఉన్న ఈ ప్రోమో లో సుధీర్ స్కిట్ తర్వాత యాంకర్ రేష్మీ.. “స్కిట్ ఓవర్.. అసలేంటి… మీరు పెద్ద తోపులనుకుంటున్నారా?” అని అనడం…వెంటనే గెటప్ శ్రీను.. స్కిట్ సూపరమ్మా.. ప్రతి సారి ఇది చేయకు నువ్వు.. అడుగు అంటూ శీను అనడంతో గొడవ కార్యరూపం దాల్చింది.

వెంటనే జడ్జ్ నాగబాబు కూడా…” ప్రాబ్లం ఏంటి మీకు? మీకు పొగరు, అహంకారం, ఇగో తెగ వచ్చేసినయ్….” అని అనడం.. వెంటనే రోజా మైకందుకొని…”మీకు స్టోరీగాని.. కొత్త కాన్సెప్ట్ గాని ఏం దొరకవా… ఎంతసేపు…ఆయన లవ్ లెటర్ ఇవ్వడం… కూతురుకు ఇవ్వడం.. అమ్మకు ఇవ్వడం…”… అంటూ రోజా అనడంతో… వెంటనే గెటప్ శీను… రోజాను ఉద్దేశించి…”మీరు చెప్పండి మేడం..ఎలా చేయాలో అనడం”, ఎలా చేయాలో మీకు తెలియదా అంటూ నాగబాబు ఆగ్రహానికి గురయ్యాడు.

సరె చెక్కు ఇవ్వు.. నీకు ఇచ్చిన చెక్కు నాకివ్వు నేను చెబుతా అంటూ రోజా కూడా ఆగ్రహానికి గురవ్వడం… ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారా ఎవరన్నా.. ఇదో స్కిటా అసలు అంటూ నాగబాబు అనడం.. వెంటనే సుధీర్ చేస్తే తెలుస్తుంది సార్ అనడం.. నాగబాబుకు ఆగ్రహాన్ని గురిచేసింది.

వెంటనే చేయండి సార్ అంటూ శీను, రాంప్రసాద్ కూడా నాగబాబు ను అనడంతో… ఇష్యూ చేయాలనుకుంటున్నారా మీరు… ఫస్ట్ మీరు ఔట్ ఆఫ్ మై సైట్ అంటూ నాగబాబు సీరియస్ గా అనడంతో వెంటనే అక్కడ నుంచి సుధీర్ టీం బయటికి వెళ్లిపోయింది.

ఇది ప్రోమోలో జరిగిన సంఘటన. అయితే.. ఇది నిజమా.. లేక… వ్యూస్ పెంచుకోవడం కోసం జబర్దస్త్ టీం వేసిన ఎత్తుగడా అనేది తెలియాలంటే మాత్రం షో టెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే మరి…

Comments

comments