Home తాజా వార్తలు తీపెంత చేదో..!

తీపెంత చేదో..!

sweets

ఉద్యోగమొచ్చిందనో, పుట్టినరోజనో, పెళ్లిరోజనో, స్నేహితులు, బంధువులను కలవడానికి వెళ్లినప్పుడో ఇంచుమించు అందరం చేసే పనేంటంటే  ఠపీమని ఏ స్వీటు బాక్సో కొనేసుకుని తీసుకెళ్తుంటాం. బైకో, కారో కొన్నప్పుడు ఫ్రెండ్స్, కొలీగ్స్ పార్టీ అడిగితే దగ్గర్లో ఉన్న స్వీటు షాపు నుంచి మిఠాయి తెప్పించి, తలో ముక్కా ఇచ్చేస్తాం. అబ్బాయో అమ్మాయో పుట్టిందని తెలియగానే ఇంట్లో పెద్దవాళ్లు చక్కెర డబ్బా తీసుకుని గుప్పెడు చక్కెర నోట్లో పోస్తారు. సందర్భం ఏదైనా   పంచదార మాత్రం  కామన్. అంటే శుభం అనగానే టక్కున గుర్తొచ్చేది తీపి.  ఇలాంటి ఏ శుభవార్త చెప్పినా వెంటనే అట్నుంచి వచ్చే స్పందన కంగ్రాట్స్. మంచి వార్తలన్నీ మిఠాయిని మోసుకొస్తాయి. కానీ దాంతోపాటు అనేక సమస్యల్నీ, వ్యాధులను తెచ్చి తీపిని కాస్తా చేదుగా మారుస్తాయి.

తీపి కబురు ఉత్తి మాటలతో చెబితే చప్పగా ఉంటుంది. ఇక పండుగలు వచ్చాయంటే స్వీట్లు తినకుండా ఉండనే ఉండం. ఇంట్లో చేసుకోవడమో, స్వగృహ నుంచి తెప్పించుకోవడమో చేస్తాం. పెళ్లి భోజనాలైతే కనీసం ఓ అరడజనైనా స్వీట్ల రకాలుండాల్సిందే. అప్పుడే విందు బ్రహ్మాండం అనే పేరొస్తుంది. అసలెందుకు తీపిపై ఇంత మమకారం. ఈ తీయని బంధం తల్లిపాలతోనే మొదలౌతుందట. తల్లి చనుబాలలోని లాక్టోజ్‌తో బిడ్డకు తొలిసారిగా తీపి పరిచయం అవుతుంది. అనంతరం అన్నప్రాశన రోజున పాయసం రుచిచూస్తారు. అడుగులు వేస్తే అరిసెలు, పెరుగుతున్న కొద్దీ చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఐస్‌క్రీమ్‌లూ ..అలా వయసు పెరుగుతున్న కొద్దీ చక్కెర బంధం కొనసాగుతూంటుంది.

చక్కెర చరిత్రకెళ్తే… పంచదార చాలా ప్రాచీనమైంది. చక్కెర మూలాలు క్రీస్తుపూర్వం 4,5 శతాబ్దాల నాటికే ఉన్నట్లు ఆధారాలున్నాయి. అన్ని మొక్కలూ గ్లూకోజ్ రూపంలో చక్కెరను తయారు చేసు కుంటాయన్న విషయం తెలిసిందే. దాన్ని వేరు చేయలేం. చెరకులో మాత్రం ఈ వెసులుబాటు ఉంది. కొన్ని రకాల దుంపల నుంచి కూడా చక్కెరను తయారుచేస్తున్నారు. శర్కర అనే సంస్కృత పదం నుంచి చక్కెర పుట్టింది. గుప్తుల కాలం నాటికే స్పటికల్లా చక్కెరను తయారుచేసే సామర్థాన్ని మనం సాధించామట. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ విలువైన బౌద్ధ సాహిత్యంతో పాటు చక్కెర తయారీ రహస్యాన్ని తనతో తీసు కెళ్లాడంటారు. ఇలా ప్రతి పాలకుడూ మన దేశం నుంచి చెరుకు గడలను తీసుకెళ్లినవారే. అప్పటి వరకు ఆయా దేశాల్లో పిండివంటల్లో తీపిదనం కోసం పండ్లు, తేనె, బార్లీ వాడేవారట. అలా ప్రపంచానికి తొలిసారిగా చక్కెరను పరిచయం చేసింది మనమే. ప్రపంచ ఉత్పత్తిలో 13 శాతానికి పైగా మనమే తినేస్తున్నాం కూడా.

పంచదార ఒంట్లోకెలా వెళ్తుందంటే… కాఫీ, టీలు, మిఠాయిలు, శీతలపానీయాలు మొదలైన వాటి తయారీలో వాడే సాధారణ పంచదార రూపంలోను, కూరగాయలు, పండ్లూ, పాలు , రొట్టెల్లో ఉండే కార్బొహైడ్రేట్లు రూపంలోను మన శరీరంలోకి వెళ్తుంది. రెండో రకం ఏమంత ప్రమాదకరం కాదంటారు వైద్యులు. ఎందుకంటే వాటిలో చక్కెరతోపాటు ప్రొటీన్లు, ఖనిజాలు, ఇనుములాంటి పోషకాలుంటాయి. సాధారణ చక్కెరలో మాత్రం పోషకాలు అస్సలు ఉండవు. అంటే ఓ స్థాయి తర్వాత ఆ తీపంతా విషంలా పనిచేస్తుందన్నమాట. మనం తీసుకునే తీపి పదార్థాలలోని కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి.

Sugar-Free

మిగిలినదంతా కొవ్వుగా మారిపోతుంది. శరీరానికి ఇతర పోషకవిలువలతోపాటు చక్కెర కూడా అవసరమే. తక్కువ బరువుతో బాధపడుతున్నవారు, పోషక లోపం వున్న పిల్లలకు తక్షణ శక్తి కావాలంటే చక్కెర తీసుకోవాల్సిందే. లేకుంటే ఒంట్లోని మాంసకృత్తులన్నీ అసలు బాధ్యతను పక్కన పెట్టేసి, శక్తిని ఇవ్వడానికే పరిమితం అవుతాయి. అతి అనర్థమే కదా ..అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటేనే అసలు సమస్యంతా. లేకుంటే ఆ చక్కెర శరీర భాగాల్లో కొవ్వుగా పేరుకుపోతుంది.

ఎక్కువైతే రోగాలు ఖాయం.. చక్కెర వాడకం రోజుకు పాతిక నుంచి 30 గ్రా..లకు మించితే అనారోగ్యానికి దగ్గరవుతున్నట్లేనని హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన తీపి విషంతో సమానమంటున్నారు. ప్రపంచ సగటు వినియోగంతో పోలిస్తే, ఇండియా ఎక్కువే వాడుతోంది. కాఫీలో అదనపు చెంచా, గులాబ్‌జాంలో మరింత పాకం, పాయసంలో మోతాదుకు మించి తీపి, ఇలా అద్దూఅదుపూ లేకుండా వాడేస్తుంటాం. మార్కెట్లో అమ్మకానికున్న 75 శాతం బేకరీలకు , ఐస్‌క్రీమం తయారీదారులకు, శీతల పానీయ సంస్థలకు, చాక్లెట కంపెనీలకు, స్వీట్ షాపులకు వెళ్తోంది. చివరికి తిరిగి తిరిగి మన శరీరంలోకే చేరుతుంది. రోగాలను తెచ్చిపెడుతుంది.

Honey-vs-Sugar

పంజాబ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో చక్కెర వాడకం ఎక్కువ. అందుకే ఇక్కడ ఊబకాయులూ అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పోలిస్తే, అక్షరాస్యత అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే చక్కెర వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పల్లె జనం నెలకు సగటున 2.2 కిలోల చక్కెరను వినియోగిస్తుంటే, నగరవాసులు ఐదున్నర కిలోలను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసింది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో 5శాతం మందికి హృద్యోగాలు ఉంటే, పట్టణాల్లో అది 10 శాతం ఉన్నట్లు తెలిసింది. అధిక రక్తపోటు సమస్య పల్లెల్లో 5 శాతం ఉంది.

అదే పట్టణాల విషయంలో ఆ సంఖ్య 15 శాతంగా ఉంది. చక్కెరను ఎక్కువగా వాడకం వల్ల చిన్నవయసులోనే కళ్లను శుక్లాల పొర కమ్మేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కులో సైనస్ సమస్యలొస్తాయి. వినికిడిని బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు దెబ్బ తీస్తాయి.  అందానికీ శత్రువే.. కాఫీ,టీలు, కూల్‌డ్రింక్స్, లస్సీ ఇలా ఏదో ఒక రూపంలో ఉండే ద్రవాల్లో రోజుకు ఓ అరగంట సేపు మన దంతాలు మునిగితేల్తుంటాయి.వెంటనే సూక్ష్మజీవులు తిష్టవేసుకుంటాయి. చక్కెర చర్మాన్ని ముడతలు పడేలా చేస్తుంది. చిన్నవయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. స్థాయికి మించి చక్కెర నిల్వలు శరీరంలో ఉంటే జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుందట. మహళల్లో జుట్టు ఊడిపోవడానికి, పురుషుల్లో బట్టతల రావడానికీ చక్కెరే కారణమంటున్నాయి అధ్యయనాలు.

చక్కెరకు ప్రత్యామ్నాయం ఏమంటే .. ముందుగా చెప్పుకోవాల్సింది తేనె. చక్కెర పుట్టకముందు మిఠాయిల తయారీకి తేనే దిక్కు. చక్కెరలో వందకు వంద శాతం కార్బోహైడ్రేట్లు ఉంటే, తేనెలో 85 శాతం వరకు ఉంటాయి. చక్కెర స్థానంలో బెల్లాన్ని ఉపయోగించమని చెబుతున్నారు పోషకాహారనిపుణులు. బెల్లంలో కాల్షియం, ఇనుము దండిగా ఉంటాయి. కృత్రిమంగా తయారైన తీపిగుళికలు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. పిల్లలూ, గర్భిణులను అస్సలు వాడొద్దంటున్నారు.
చక్కెర ఉండే పోషకాలు

ప్రతి వంద గ్రాముల చక్కెరలో దాదాపుగా శక్తి 387 కెలోరీలు, కార్బొహైడ్రేట్లు 99.98 గ్రా.,కొవ్వు 0, ప్రొటీన్లు 0, విటమిన్ బి2 0.019 మిల్లీగ్రాము, ఇనుము 2 మిల్లీగ్రాములు, పొటాషియం 2 మిల్లీగ్రాములు, నీళ్లు 0.03 గ్రాములుంటాయి. క్రమంగా తగ్గించుకోండి.. టీ కాఫీల విషయంలో రెండు చెంచాల నుంచి ఒక చెంచాకు, క్రమంగా సగం చెంచాకు తగ్గించుకుంటూ పోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే అలవాటైపోతుంది. తీపి పదార్థాలను తింటున్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుందని నిపుణులు గుర్తించారు. ఆ అలవాటే మనిషిని చక్కెరకు బానిసను చేస్తుందట.

ఈ మధ్య చాలా మంది బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలకు అలవాటు పడటం శుభపరిణామమే. అంటే ఆరోగ్యంపై చాలా ఎక్కువే అవగాహన కలిగిందన్నమాట. శీతలపానీయాల్లో ఉండే కృత్రిమమైన చక్కెర పాకం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని అమెరికన్ సొసైటీ ఫర్ నెఫ్రాలజీ ప్రకటించింది. అదేవిధంగా మార్కెట్లో దొరికే రెడీమేడ్ పండ్ల రసాలు కూడా అనారోగ్యహేతువులే. వాటిలో 80 శాతం పానకమైతే 20 శాతమే పండ్ల రసం ఉంటుంది. డైట్ బిస్కెట్లు కూడా అటువంటివే.వాటిల్లో అలిగోశాక్రైడ్స్ రూపంలో చక్కెర ఉంటుంది. వీటివల్ల జీర్ణ సామర్థం దెబ్బ తింటుంది.

సంప్రదాయ చిరుతిళ్లే మంచివి దె డయాబెటిక్ ఫౌండేషన్ అంచనా ప్రకారం ఏడు మహా నగరాల్లో దాదాపు పాతిక శాతం మంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. వారు తినే ఐస్‌క్రీంలు,చాక్లెట్లూ, కూల్‌డ్రింకులే అందుకే ప్రధాన కారణం. అలా కాకుండా వారికి సంప్రదాయ చిరుతిళ్లయిన కొబ్బరి ఉండలు, నువ్వుల ఉండలు, పప్పు చెక్కలూ, జంతికలు, ఇలా చేసి పెడితే రుచితో పాటు ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.

దేంట్లో ఎంతెంతంటే…
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు ఆరోగ్యవంతురాలైన మహిళ రోజుకు 6 చెంచాలు( 25 గ్రా.) , పురుషులైతే 8 చెంచాలు (35 గ్రా.) చక్కెర వాడవచ్చు. మోతాదు దాటితే మాత్రం అనారోగ్యకరమే అంటున్నారు. భారతీయుల సగటు వినియోగం వంద గ్రాములు దాటుతోందని గణాంకాలు చెబుతున్నాయి. కప్పు టీ – 8గ్రా, ఒక బిస్కట్‌లో 4గ్రా, 200గ్రా. మార్కెట్లో దొరికే పళ్లరసంలో 25 గ్రా., రెండు చెంచాల జామ్‌లో 6గ్రా., ఒక సీటు ముక్కలో 7 నుంచి 10 గ్రా., శీతల పానీయంలో 10 నుంచి 15 గ్రా., వరకు చక్కెర ఉంటు పళ్లరసంలో మిఠాయికి బదులుగా.. ప బంధువులు , మిత్రుల ఇంటికి వెళ్లేటప్పుడు , శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నప్పుడు స్వీటు బాక్సుకు బదులుగా హాయిగా రకారకాల సీజనల్ పండ్లను తీసుకెళ్లండి. లేదా పచ్చని మొక్కను ఇవ్వండి. మంచి పుస్తకాన్ని అందించండి. ఇలా అప్పుడప్పుడూ మారుస్తూ వారిని ఆనందపరచండి..

చక్కెరలో ఉండే పోషకాలు

ప్రతి వంద గ్రాముల చక్కెరలో దాదాపుగా శక్తి 387 కెలోరీలు, కార్బోహైడ్రేట్లు 99.98 గ్రా., కొవ్వు 0, ప్రొటీన్లు 0, విటమిన్ బి2 0.019 మిల్లీగ్రాము, ఇనుము 2 మిల్లీగ్రాములు, పొటాషియం 2 మిల్లీగ్రాములు, నీళ్లు 0.03 గ్రాములుంటాయి. క్రమంగా తగ్గించుకోండి.. టీ కాఫీల విషయంలో రెండు చెంచాల నుంచి ఒక చెంచాకు, క్రమంగా సగం చెంచాకు తగ్గించుకుంటూ పోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే అలవాటైపోతుంది. తీపి పదార్థాలను తింటున్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుందని నిపుణులు గుర్తించారు. ఆ అలవాటే మనిషిని చక్కెరకు బానిసను చేస్తుందట. ఈ మధ్య చాలా మంది బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలకు అలవాటు పడటం శుభపరిణామమే. అంటే ఆరోగ్యంపై చాలా ఎక్కువే అవగాహన కలిగిందన్నమాట. శీతలపానీయాల్లో ఉండే కృత్రిమమైన చక్కెర పాకం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని అమెరికన్ సొసైటీ ఫర్ నెఫ్రాలజీ ప్రకటించింది. అదేవిధంగా మార్కెట్లో దొరికే రెడీమేడ్ పండ్ల రసాలు కూడా అనారోగ్యహేతువులే. వాటిలో 80 శాతం పానకమైతే 20 శాతమే పండ్ల రసం ఉంటుంది. డైట్ బిస్కెట్లు కూడా అటువంటివే. వాటిల్లో అలిగోశాక్రైడ్స్ రూపంలో చక్కెర ఉంటుంది.

వీటివల్ల జీర్ణ సామర్థం దెబ్బ తింటుంది.
సంప్రదాయ చిరుతిళ్లే మంచివి.. డయాబెటిక్ ఫౌండేషన్ అంచనా ప్రకారం ఏడు మహా నగరాల్లో దాదాపు పాతిక శాతం మంది పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. వారు తినే ఐస్‌క్రీంలు,చాక్లెట్లూ, కూల్‌డ్రింకులే ప్రధాన కారణం. అలా కాకుండా వారికి సంప్రదాయ చిరుతిళ్లయిన కొబ్బరి ఉండలు, నువ్వుల ఉండలు, పప్పు చెక్కలూ, జంతికలు..ఇలా చేసి పెడితే రుచితో పాటు ఆరోగ్యానికీ ఏ ఢోకా ఉండదు.

బంధువులు, మిత్రుల ఇంటికి వెళ్లేటప్పుడు, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నప్పుడు స్వీటు బాక్సుకు బదులుగా హాయిగా రకారకాల సీజనల్ పండ్లను తీసుకెళ్లండి.  పచ్చని మొక్కను ఇవ్వండి. మంచి పుస్తకాన్ని అందించండి. ఇలా అప్పుడప్పుడూ అందమైన, ఆరోగ్యకరమైన బహుమతులను అందిస్తూ వారిని ఆనందపరచండి.

Sugar Symptoms in Telugu

telangana latest news

 మల్లీశ్వరి వారణాసి