Search
Wednesday 21 November 2018
  • :
  • :

యెమెన్‌లో ఆత్మాహుతి దాడులు : 26మంది మృతి

TERR-ATTACKఅడెన్ : యెమెన్‌లోని అడెన్ నగరంలో వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. భద్రతాసిబ్బంది టార్గెట్‌గా ఉగ్రవాదులు ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. బురైఖా ప్రాంతంలోని చెక్‌పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పేలుడు పదార్ధాలతో వచ్చిన ఓ అంబులెన్స్‌ను గుర్తించారు. అంబులెన్స్ డోర్‌ను తెరిచేలోపే అందులో ఉన్నే వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే చెక్‌పాయింట్ వద్ద మరో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. ఇంకొందరు గాయపడ్డారు. తామే ఈ దాడులు చేసినట్లు ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. యెమెన్‌లో ఏడాది క్రితం అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికే ఐఎస్‌ఐఎస్ అనేక మార్లు దాడులు చేసింది.

Comments

comments