Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లైంగిక వేధింపుల కారణంగానే డాక్టర్ శిల్ప ఆత్మహత్య

Bellam-Shilpa

Suicide by doctor with sexual abuse in chittoor

చిత్తూరు: రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్న వైద్యురాలి శిల్ప ఆత్మహత్యకు కారణం లైంగిక వేధింపులే అని శుక్రవారం సిఐడి అధికారులు తెలిపారు. సిఐడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో చిన్న పిల్లల విభాగంతో పీజి వైద్య విద్యను చదువుతుంది. అదే సమయంలో చిన్నపిల్లల విభాగ అధికారి రవికుమార్‌, సహాయ ఆచార్యులు కిరీటి, శశికుమార్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని స్థానిక పోలీసులతో పాటు గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేసింది. శిల్ప ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్‌, కార్యాలయం విచారణ నిర్వహించాలని ఆదేశించారు. దాంతో ఎస్వి వైద్య కళాశాల ప్రధానాచార్యులు విచారణ నిర్వహించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు… వేధింపులు తగ్గకపోవడంతో ఆమె కుంగిపోయి తన సొంతూరు పీలేరులో ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ శిల్ప సోదరి శ్రుతి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టగా  ఆమె ఆత్మహత్యకు వేధింపులే కారణమని తెలిపారు. డాక్టర్‌ శిల్ప ఆత్మహత్యకు కారణమైన రవికుమార్‌తో పాటు సహకరించిన సహాయ ఆచార్యులు డాక్టర్‌ కిరీటి, శశికుమార్‌ పైనా కేసులు నమోదు చేసినట్టు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

Suicide by doctor with sexual abuse in chittoor

Telangana Latest News

Comments

comments