Home నిర్మల్ భార్య మందలించిందని భర్త ఆత్మహత్య…

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య…

Suicide

ఉరివేసుకుని ఒకరి ఆత్మహత్య

మనతెలంగాణ, భైంసా: పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన పోశెట్టి(40) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత కొన్ని రోజులుగా పోశెట్టి మద్యానికి బానిసయ్యాడు. మద్యం అతిగా సేవించిన ఆయన తన భార్య మందలించిందని మనస్థాపం చెంది మంగళవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి నిర్మల్ జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.