Home కరీంనగర్ కడుపు నొప్పితో యువతి ఆత్మహత్య

కడుపు నొప్పితో యువతి ఆత్మహత్య

Suicide with a stomach ache
మనతెలంగాణ/హుజూరాబాద్: మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఓ యువతి కడుపు నొప్పి బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొగిళి తిరుపతి-రాజమ్మలకు నలుగురు సంతానం. అందులో రెండో కుమార్తె అయినా మొగిళి రజిత(18) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మొగిళి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.