Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు

speak

*శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ

మనతెలంగాణ/కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొన్నటివరకు రైతులు ఇప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకు ంటున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. గురు వారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో బుధ వారం ఉద్యోగం రాదని తన తల్లిదండ్రుల శ్రమ వృధా అయిపోయిం దని రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన విద్యా వలంటీర్ సుప్రజ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని చూసి అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన సమస్యలన్ని తీరి మన ఉద్యో గాలన్నీ మనకే వస్తాయని నమ్మిన యువత నేడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన ఉద్యోగాలు రాకపోవడంతో ఉద్యోగాలు రావని మనస్థా పానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మొన్న యూనివర్సి టిలు మురళీ ముదిరాజ్ కాగా నేడు సుప్రజ ఆత్మహత్య చేసుకుందని ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. దీనిని రాజకీయం చేయకుండా కెసిఆర్ వెంటనే డియస్సీ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ప్రగతి భవన నిర్మాణం కోసం రూ. 300ల కోట్లు వెచ్చి ంచి భవనాన్ని నిర్మించుకొని అందులో పరిపాలన సాగించడం కాదని ప్రజాపాలన అంటే ప్రజల కష్టాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడమే పరిపాలన అని అన్నారు. ఇకనైనా రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చేతికి వచ్చిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవ డంతో తల్లిదండ్రులు తట్టుకోలే కపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కామా రెడ్డి జడ్పిటిసి మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ దామోదర్‌రెడ్డి, కామారెడ్డి కాం గ్రెస్ పార్టీ కార్యదర్శి గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments