Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

తగ్గని ఆత్మహత్యలు

sucide

 గత మూడేళ్లలో రాష్ట్రంలో ఒకేస్థాయిలో కొనసాగిన ఆత్మహత్యలు

 దేశ వ్యాప్తంగా  5వ స్థానంలో తెలంగాణ                   

 ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎస్‌సిలు 15%, ఎస్‌టిలు 10% 

2014తో పోలిస్తే రాష్ట్రంలో పెరిగిన ఎస్‌సి, ఎస్‌టిల సూసైడ్లు

 హైదరాబాద్ : గడిచిన మూడేళ్ళలో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో ఐదవ స్థానం తెలంగాణదే. ఈ మూడేళ్ళలో ఆత్మహత్యలు దాదాపుగా ఒకే స్థాయిలో జరుగుతున్నాయి. 2014లో 1.31 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే 2015లో 1.33 లక్షలు, 2016లో 1.30 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో తెలంగాణలో 9,019 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఇది 10,140గా ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎస్సీలు దాదాపు 15% మంది, 10% మంది ఎస్టీలు ఉన్నారు. దేశం మొత్తంమీద 19,763 మంది ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటే ఇందులో తెలంగాణ 1,665 మందితో మూడవ స్థానంలో, 11,509 మంది గిరిజనులు ఆత్మహత్య చేసుకుంటే 1,163 మందితో నాల్గవ స్థానంలో ఉంది. రాజ్యసభ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం 2014 నుంచి 2016 వరకు దేశవ్యాప్తంగా 1,30,691 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇందులో 9,019 మంది తెలంగాణలో ఉన్నారు. అత్యధికంగా 17,195 మంది మహారాష్ట్రలో ఆ తర్వాత 15,182 మంది తమిళనాడులో, 10,687 మంది కర్నాటకలో, 10,442 మంది మధ్యప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఐదవ స్థానం తెలంగాణదే. దేశం మొత్తంమీద 19,763 మంది ఎస్సీలు ఆత్మహత్య చేసుకోగా,ఇందులో 8.4% (1,665 మంది) తెలంగాణలోనే ఉన్నారు. అత్యధికంగా తమిళనాట 3,290 మంది, 2,283 మంది మహారాష్ట్రలో ఉంటే మూడవ స్థానం తెలంగాణదే. మొత్తం 11,509 మంది గిరిజనులు ఆత్మహత్య చేసుకుంటే ఇందులో 10% మంది తెలంగాణలో ఉన్నారు. 2014తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ ఆత్మహత్యల సంఖ్య తెలంగాణలో పెరిగింది. రాష్ట్రంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఎస్సీ, ఎస్టీలే. ప్రస్తుత సంవత్సరానికి ఇంకా రాష్ట్రాల నుంచి గణాంకాలు పూర్తి స్థాయిలో అందలేదని, దాన్ని జాబితాగా రూపొందించే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తన సమాధానంలో పేర్కొనింది. ఎక్కువగా అనారోగ్య సమస్యలు (22,415 మంది), ఆ తర్వాత కుటుంబపరమైన వైవాహిక సంబంధాలు (6,910 మంది) ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.

Comments

comments