Home తాజా వార్తలు అవిశ్వాస తీర్మానంపై టిఆర్ఎస్ మద్దతు కోరాం…

అవిశ్వాస తీర్మానంపై టిఆర్ఎస్ మద్దతు కోరాం…

kesav-rao-sujana-image
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని టిడిపి ఎంపి సుజనాచౌదరి తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై టిఆర్‌ఎస్ మద్దతు కోరామన్నారు. ఈ సందర్భంగా కె. కేశవరావుతో సుజనా భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన హామీల అమలుపై చర్చించామని సుజనా పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నేతలు కూడా ఎపికి అన్యాయాన్ని అంగీకరించారని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన వాగ్దానాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తులకు టిఆర్‌ఎస్ సానుకూలంగా స్పందించదని సంతోషం వ్యక్తం చేశారు. 
ఎపి సమస్యలు, విభజన హామీలపై సుజనాచౌదరితో మాట్లాడనని ఎంపి కేశవరావు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై టిఆర్‌ఎస్ మద్దతు అడిగారన్నారు. తెలంగాణకు కూడా సమస్యలున్నాయని, విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాలనకు అడ్డంకులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మాణం పెడితే ఆలోచించి తమ నిర్ణయం చెబుతానన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబందించిన విషయమని తెలియజేశారు.