Home తాజా వార్తలు సస్పెన్స్ థ్రిల్లర్

సస్పెన్స్ థ్రిల్లర్

Stuartpuram First Look Poster

 

అర్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో ‘గూఢచారి’ ఫేమ్ ప్రీతిసింగ్ ప్రధానపాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘స్టూవర్టుపురం‘. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సెర్టిపికెట్‌తో జూన్ 14 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ “ట్రైలర్ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. దర్శకుడు సత్యనారాయణ కొత్త ఐడియాతో ఈ సినిమాను తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన ఒక్క దర్శకుడు మాత్రమే కాకుండా ఎడిటింగ్, కెమెరా ఇలా ఆల్ రౌండర్ గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేశాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది”అని అన్నారు.

సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ “దర్శకుడు సత్యనారాయణ ఏకారి సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. జూన్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం”అని తెలిపారు. దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ “ఈ సినిమా కథ చెప్పాలంటే… నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్లను ఎలా ఎదుర్కొందన్న పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం”అని పేర్కొన్నారు. మల్లికా ,రవిరాజ్, భాను ప్రసాద్ ,హర్ష నల్లబెల్లి ,శివప్రసాద్, సాయిరామ్ దాసరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : వేమేష్ పెట్ల , సంగీతం : నవనీత్ చారి.

Sukumar Launch Stuartpuram Movie First Look Poster