Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

శిశువు కిడ్నాప్‌ కేసు.. నిందితురాలికి బెయిల్

Sultan Bazar Maternity Hospital Kidnap Case Accused get Bail

హైదరాబాద్: నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి శిశువును కిడ్నాప్‌ చేసిన కేసులో చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితురాలు నయనారాణి(30) శుక్రవారం బెయిల్‌పై విడుదలైంది. ఈనెల 2న ఆస్పత్రిలో ఆరు రోజుల నవజాత శిశువుకు టీకాలు వేయిస్తానని తల్లి దగ్గరి నుంచి నయనా తీసుకుని పరారైన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 28 గంటల తర్వాత శిశువును బీదర్ లో ప్రభుత్వాస్పత్రిలో గుర్తించారు. అనంతరం శిశువును కిడ్నాప్ చేసిన నిందితురాలు నయనారాణి గురించి గాలించి గురువారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కోర్టు బెయిల్‌ మంజూరుచేయడంతో ఆమె విడుదలైంది.

Comments

comments