Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆడి కారు కంటే..ఈ గుర్రానికే ఎక్కువ రేటు..!

Sultan-Horseహర్యానాకు చెందిన ఓ గుర్రం ధర ఆడి కారు కంటే ఎక్కవ పలుకుతుంది. ఆడి కారు ధర కంటే ఆ గుర్రం ఖరీదే ఎక్కువ… ఆడి ఎ4 కారు ఖరీదు రూ.41 లక్షలు.. కానీ ఈ గుర్రం ఖరీదు రూ.51 లక్షలు కంటే ఎక్కువే.. కర్నాల్ దర్బీ గ్రామానికి చెందిన సుల్తాన్ అనే గుర్రం ఎంతో స్పెషల్.. అది దేశ వ్యాప్తంగా పేరు గాంచిన గుర్రం. ఇప్పటికే ఈ గుర్రం ఎన్నో పతకాలు, చాంపియన్‌షిప్‌లు గెలిచింది. పానిపట్‌లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీలో కూడా సుల్తాన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ గుర్రాన్ని రూ.51 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. కానీ దాని యజమాని గుర్వీందర్ సింగ్ మాత్రం ససేమిరా అన్నాడు. సొంత కుమారుడిలా పెంచుకుంటున్న సుల్తాన్‌ను ఎన్ని లక్షలు ఇచ్చిన అమ్మబోనని తేల్చి చెప్పేశాడు. ఈ గుర్రాన్ని చూసుకొనేందుకు గుర్వీందర్ ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించాడు. ఇది రోజుకు ఒక లీటర్ ఆవు పాలు, 100 గ్రాముల నెయ్యితో వంటివి ఆహారంగా తీసుకుంటుంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా సుల్తాన్ పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు గుర్వీందర్ పేర్కొన్నారు.

Comments

comments