Home తాజా వార్తలు భువీ, వార్నర్ లతో కలిసి సుమ సందడి

భువీ, వార్నర్ లతో కలిసి సుమ సందడి

 

హైదరాబాద్: మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపిఎల్‌ 12వ సీజన్‌కు అన్నీ జట్లు ప్రాక్టీస్ తోపాటు ప్రకటనల రూపకల్పనలో బిజీగా ఉన్నాయి. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యులు భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్, వివిఎస్ లక్ష్మణ్‌లు ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాలతో కలిసి ఓ యాడ్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సుమ భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్ లతో కలిసి ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

‘డబుల్ హార్స్ మినపగుళ్లు’ కోసం రూపొందుతున్న ఈ ప్రకటనలో భాగంగా సుమ చేతిలో ప్లేట్ పట్టుకుని దోశ తింటూ కనిపించింది. పక్కనే డేవిడ్ వార్నర్ దోశ వైపు ఆశగా చూడడం… అతనికి సుమ తినిపిస్తున్నట్టుగా ఉండడం కనిపిస్తుంది. దీంతో సుమ, ఆసీస్ క్రికెటర్‌కు దోశ తినిపించిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి సుమ సరదాగా గడపడంతో ఆమె ఫాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్ ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఇక, మార్చి24న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

 

Suma with Bhuvneshwar, warner in IPL-12 promotional