Home తాజా వార్తలు ఎన్ టిఆర్ బయోపిక్‌ లో సుమంత్…

ఎన్ టిఆర్ బయోపిక్‌ లో సుమంత్…

Sumanth will be appeared 8 getups in ntr biopic

సినిమా: బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఎన్ టిఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు క్రిష్  ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాలో అక్కినేని నాగేశ్వర్‌రావు పాత్రలో హీరో సుమంత్ కనిపించనున్నాడు.  ఈ చిత్రంలో సుమంత్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఏఎన్నార్ పాత్రకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సుమంత్ 8 రకాల గెటప్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. ఏఎన్నార్ తన జీవితంలో పలు కీలక సమయాల్లో ఎన్ టిఆర్‌ను కలిసి ముచ్చటించేవారట. ఆ సమయాల్లో ఏఎన్నార్ వయస్సుకు తగినట్లుగా సుమంత్‌ను 8 గెటప్స్‌లో చూపించేలా క్రిష్ ప్లాన్ చేసినట్టు టాక్. మొదటి భాగం ‘కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ‘మహానాయకుడు’ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.