Home జాతీయ వార్తలు వైసిపి ఎంపిల రాజీనామాలు ఆమోదం

వైసిపి ఎంపిల రాజీనామాలు ఆమోదం

YCP

న్యూఢిల్లీ: వైసిపి ఎంపిల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం డిమాండ్ చేస్తూ వైసిసికి చెందిన 5గురు ఎంపిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.రాజీనామా చేసిన ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్‌లు తమ రాజీనామా లేఖలను ఏప్రిల్ 6న సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. ఆ తర్వాత 10 రోజుల పాటు 3 దేశాల పర్యటనకు వెళ్లివచ్చిన అనంతరం ఎంపిలు రాజీనామాల అంశంపై అధికారులతో సంప్రదింపులు జరిపి వారి రాజీనామాలను ఆమోదించారు.