Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కన్నీరు పెట్టుకున్న సుమిత్రా మహాజన్

Delhi : Sumitra Mahajan Tears up on the death of Somnath Chatterjee

ఢిల్లీ : మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) మృతిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమనాథ్ తనకు అన్న వంటి వారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. 1989లో పార్లమెంట్‌లో తాను అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన లేవనెత్తిన ప్రతి అంశాన్ని తాను గమనించేదానని చెప్పారు. ఆయన స్పీకర్‌గా పని చేసిన కాలం తనకు గైడెన్స్‌గా ఉపయోగపడిందని ఆమె పేర్కొన్నారు. తమ ఇద్దరి భావజాలాలు వేరు అయినప్పటికీ, తాను ఆయన్ను అన్నగానే భావించేదానినని తెలిపారు. ఆయన మృతి తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

 Sumitra Mahajan Tears up on the death of Somnath Chatterjee

Comments

comments