Friday, April 26, 2024

రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తో న్న విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే.. బుధవారం ఆ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కా నున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి వే సవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12వ తేదీన పాఠశాలలు పు నః ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి వరకు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసి, తల్లిదండ్రుల తో సమావేశం నిర్వహించనున్నారు. రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపథ్యం లో ప్రస్తుతం ్ల ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి.

మార్చి 15 నుంచి ఒంటి పూ ట బడులు మొదలు కాగా, మంగళవారం తో ముగియనున్నాయి. ఏడాది పాటు పు స్తకాలు, పరీక్షలతోకుస్తీ పట్టిన విద్యార్థులు.. వేసవి సెలవుల్లో హాయిగా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పెద్దలే ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారు.. ఇక చిన్నారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ఫలితాలు వెలువడనుండగా, ఈ నెల 30న టెన్త్ ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News