Home జాతీయ వార్తలు ‘సుప్రీం’కు వేసవి సెలవులు

‘సుప్రీం’కు వేసవి సెలవులు

Supreme Court judgment Postpones on Rafale Review

అత్యవసర వ్యాజ్యాల కోసం ప్రత్యేక ధర్మాసనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: సుప్రీంకోర్టుకు మంగళవారం నుంచి జూన్30వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈక్రమంలో సుప్రీంకోర్టు సెలవు రోజుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మే 13వ తేదీ నుంచి 20వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్‌ఖన్నా ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది.

అదేవిధంగా మే 21వ తేదీ నుంచి 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్‌ఎం.ఆర్.షా ధర్మాసనం అలాగే మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ జస్టిస్ రంజన్‌గోగోయ్, జస్టిస్‌ఎం.ఆర్.షా, మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్‌ఎం.ఆర్.షా, జూన్ 3వ తేదీ నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ఎం.ఆర్.షా, జూన్ 6 నుంచి జూన్13 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనాలు అత్యవసర వ్యాజ్యాల విచారణ చేపట్టనున్నాయి. కాగా జూన్14 నుంచి జూన్30 వరకు ధర్మాసనాల వివరాలను అనతికాలంలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Summer holidays for Supreme court