Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మండుతున్న ఎండలు.. వినియోగదారులూ జాగ్రత్త

sun

మనతెలంగాణ/సిరిసిల్లరూరల్‌ః రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. మధ్యాహ్న సమయం నుం డి సాయంత్రం వరకు రోడ్ల మీద జనసందోహాం లేకు ండా రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సామాన్య ప్రజలు ఎండ వేడిని తట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండ్లలో చల్లదనానికి సామాన్యుల ఎసిగా పేరుగాంచిన రెడీమేడ్ కూలర్‌లను వాడుతున్నారు.

ఉత్పత్తిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటి ంచకుండా నాసిరకం విడిబాగాలతో కూలర్‌లను తయారు చేసి వినియోగదారులకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెల గాటమాడుతున్నారు.సామాన్యులకు అందుబాటు ధర లో ఫ్రిజ్‌లు లేని కారణంగా రంజా న్‌లను విరివిగా కొ నుగోలు చేస్తూ దాహార్తిని తీర్చు కుంటున్నారు. వేసవి తాపాన్ని తగ్గించే మరో మార్గం పుచ్చకాయలు. వీటిలో 90 శాతం నీరు కలిగి ఉండడంతో కోల్పోయిన శరీర లవణాలను తిరిగి పొంద వచ్చనే కారణంగా భారీగా పు చ్చకాయల కొనుగోళ్లు చేస్తున్నారు.

పుచ్చకాయలపై ఓ పుకారు ప్రచా రంలో ఉంది. ఎరుపు రంగులో కనిపించడానికి వాటికి కొన్ని రసాయణాలు కలిపిన ఇ ంజక్షన్‌లను ఇస్తారనే పుకార్లు సామాజిక మాద్య మాల లో షికార్లు చేస్తు న్నాయి. వినియోగదారులు ఎప్పటి అ వసరాలు అప్పుడే అనే చందంగా మారి నాణ్యతా ప్ర మాణాలు చూడ కుండా క్రయవిక్రయాలు జరపడంతో ప్రాణాపాయ పరిస్థితుల ఎదురవుతున్నాయి.

Comments

comments