Home ఆంధ్రప్రదేశ్ వార్తలు అరసవిల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

అరసవిల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

Arasavalli Temple అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీశ్రీశ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడి ప్రభాత కిరణాలు స్వామివారి మూల విరాట్‌ను తాకాయి. దీంతో ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయప్రాంగణం భక్తజన సంద్రోహంగా మారింది. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకడం చూసిన భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. సూర్యుడు ఉత్తర, దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఆలయ పూజారులు చెప్పారు. భక్తుల సందడితో ఈప్రాంతమంతా నూతన శోభను సంతరించుకుంది.

Sun Miracle at Arasavalli Suryanarayana Swamy Temple