Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సన్‌రైజర్స్‌కు పరీక్ష

  • నేడు పుణెతో సమరం

Pune-SRH

హైదరాబాద్: ఢిల్లీ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఇరు జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడి యంలో పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని హైదరా బాద్ భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీ దున్న పుణె కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఇందులో గెలిచి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని తహతహ లాడ తోంది. అయితే సొంతగడ్డపై ఎదురులేని రికార్డు కలిగిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించేందు కు సిద్ధమైంది. కెప్టెన్ వార్నర్, సీనియర్లు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, విలియమ్‌సన్‌లు ఫాంలో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో కూడా టాప్ ఆర్డర్ మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే హైదరాబాద్‌కు గెలుపు నల్లేరుపై నడకే. పదో సీజన్‌లో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతు న్నాడు. అతనికి శిఖర్ ధావన్ అండగా నిలుస్తున్నాడు. దా దాపు ప్రతి మ్యాచ్‌లోనూ వీరిద్దరూ శుభారంభమే అందిం చారని చెప్పవచ్చు. ఈసారి కూడా జట్టు వీరి నుంచి ఇటు వంటి ఫీట్‌నే ఆశిస్తోంది. విలియమ్‌సన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. కీలక సమయంలో బ్యాట్‌ను ఝులిపిస్తూ జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. యువ రాజ్ సింగ్ కూడా కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటు న్నాడు. ఢిల్లీపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, బౌలింగ్‌లో హైదరాబాద్ చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, రషేద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్ తదితరులతో కూడిన బౌలింగ్ లైనప్ ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్క ఢిల్లీ మ్యాచ్‌లో మాత్రమే హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. అయితే పుణె మ్యాచ్‌లో చెలరేగేందుకు సిద్ధమయ్యారు. బ్యాటింగ్, బౌలిం గ్ విభాగాల్లో బలంగా ఉన్న సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జోరు మీదుంది…
మరోవైపు పుణె కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓ డించి ఊపుమీదుంది. హైదరాబాద్‌ను కూడా ఓడించి ప్లేఆ ఫ్‌కు దూసుకు పోవాలని తహతహలాడుతోంది. కోల్‌క తా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ త్రిపాఠి ఈ మ్యాచ్‌లో కూడా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యా డు. అతను విజృంభిస్తే హైదరాబాద్ బౌలర్లకు కష్టమే. మరోవైపు మరో వైపు బెన్‌స్టోక్స్ రూపంలో అగ్రశ్రేణి ఆల్ రౌండర్ ఉండనే ఉన్నాడు. ఇప్పటికే కళ్లు చెదిరే సెంచరీ సాధించి స్టోక్స్ సత్తా చాటాడు. కెప్టెన్ స్టివ్ స్మిత్, సీనియర్ మహేంద్ర సింగ్ ధోనీ, రహానె, మనోజ్ తివారి తదితరులతో బ్యాటింగ్ పటి ష్టంగా ఉంది. బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహెర్, వాషింగ్టన్ సుందర్, ఉనద్కట్ తదితరులు జోరుమీదున్నా రు. రెండు జట్లు కూడా బలంగా ఉండడంతో మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
హోరాహోరీ ఖాయం…
పుణెతో జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని హైదరాబాద్ స్టార్ కానె విలియమ్‌సన్ అన్నాడు. వరుస విజయాలు సాధిస్తున్న పుణె జోరుమీదుందన్నాడు. వారిని ఓడించడం అనుకున్నంత సులువు కాదన్నాడు. పటిష్టమైన కోల్‌కతాను చిత్తు చేసిన పుణె ఈసారి కూడా ఆ జోరును కొనసాగించేందుకు ప్రతయ్నిస్తుందన్నాడు. అయితే తాము మాత్రం పుణెను ఓడించడమే లక్షంగా పెట్టుకున్నామన్నా డు. ఢిల్లీ మ్యాచ్‌లో ఎదురైన ఓటమి తమకు ఓ గుణ పాఠమన్నాడు. పుణెను ఓడించడం ద్వారా ప్లే ఆఫ్‌కు మరింత చేరువకావడమే లక్షమన్నాడు. సమస్టిగా రాణిం చి విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు.

Comments

comments