Search
Friday 16 November 2018
  • :
  • :

సూపర్ సన్‌రైజర్స్…

  • హాఫ్ సెంచరీలతో రాణించిన వార్నర్, హెన్రిక్స్
  • హైదరాబాద్ చేతిలో లయన్స్ చిత్తు
  • రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

డేవిడ్ వార్నర్ సారథ్యంలో రెండో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తూ  తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది. ఐపిఎల్ 10వ సీజన్‌లో తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేసిన హైదరాబాద్ జట్టు విజయాల బాటలో పయనిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన రెండూ మ్యాచ్‌ల్లోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టేసింది వార్నర్‌సేన. గత సీజన్‌లో ఐపిఎల్ టైటిల్ కైవసం చేసుకున్న సన్‌రైజర్స్ ఐపిఎల్ 10వ సీజన్ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.

David-Warner

హైదరాబాద్: ఐపిఎల్ 10వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ ఉప్పల్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో జరిగిన తొలిమ్యాచ్‌లో బెంగళూరుపై విజయం సాధించిన వార్నర్‌సేన.. లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లయన్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష ఛేదనలో హైదరాబాద్ జట్టు 15.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 27 బంతులు మిగిలి ఉండగానే 140 పరుగులు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌కు రెండు పాయింట్లు లభించాయి. సన్‌రైజర్స్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ మెరుపువేగంలో పరుగులు రాబట్టాడు. లయన్స్ నిర్దేశించిన సాధారణ స్కోరును సునాయాసంగా ఛేధించాడు వార్నర్. (45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్)తో 76 పరు గులు చేసిన సన్‌రైజర్స్ కెప్టెన్ హాఫ్ సెంచరీతో అజే యంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర ధావన్ (9) పరు గులకే చేతులేత్తేయడంతో 32 పరుగుల వద్ద జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం ధావన్ స్థానంలో బరిలోకి దిగిన హెన్రిక్స్ వార్నర్ జోడీగా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. సన్‌రైజర్స్ జట్టులో వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 72 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెన్రిక్స్ (39 బంతుల్లో 6 ఫోర్లు) బాది 52 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో లయన్స్ సాధారణ స్కోరును దాటేయడంతో సన్‌రైజర్స్ విజయం అనివార్యమైంది. లయన్స్ బౌలర్లలో ప్రవీణ్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నాడు.
లయన్స్ విలవిల..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి విలవిల లాడిపోయారు. గుజరాత్ ఓపెనర్లలో జాసన్ రాయ్ (31) పరుగులతో పర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ మెక్‌ల్లామ్ (5) పరుగులకే నిష్క్రమించాడు. అతని స్థానంలో వచ్చిన కెప్టెన్ సురేశ్ రైనా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోగా, 5 పరుగులకే ఎల్‌బిడబ్లుగా రైనా పెవిలి యన్‌కు చేరా డు. ఆ తరువా త వచ్చిన దినేశ్ కార్తీక్ (30), డిఆర్ స్మిత్ (37) పరు గులు చేయగా, మిగతా ఆటగాళ్లు ఫించ్ (3), కులకర్ణి (1) పేలవప్రదర్శనతో పెవిలియన్‌కు చేరారు. కాగా, ప్రవీ ణ్ కుమార్ (7), బసిల్ (13) నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గుజరాత్ లయన్స్ 135 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమా ర్ రెండు వికెట్లు, ఆశీష్ నెహ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. మూడు వికెట్లు తీసుకున్న సన్‌రైజర్స్ జట్టు బౌలర్ రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Comments

comments