Home జాతీయ వార్తలు ఎన్నికల సంఘం కొత్త సారధి అరోరా

ఎన్నికల సంఘం కొత్త సారధి అరోరా

Sunil Arora

వచ్చే నెల 2న బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా సునీల్ అరోరా నియమితులు అయ్యారు. ప్రస్తుత సిఇసి ఒపి రావత్ నుంచి అరోరా డిసెంబర్ రెండవ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల కమిషనర్లలో ప్రస్తుతం సర్వీసు కోణంలో అందరికంటే సీనియర్‌గా సునీల్ అరోరా ఉన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషర్‌గా ఆయనను నియమించారు. డిసెంబర్ రెండవ తేదీన ప్రస్తుత సిఇసి ఒపి రావత్ పదవి నుంచి వైదొలుగుతారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నూతన సిఇసి హయాంలోనే జరుగుతాయి.

Sunil Arora appointed new Chief Election Commissioner