Home బిజినెస్ ఛారిటీకి రూ.7 వేల కోట్ల విరాళం

ఛారిటీకి రూ.7 వేల కోట్ల విరాళం

 దాతృత్వం బాటలో సునీల్ మిట్టల్
Mittal

న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం సునీల్ మిట్టల్ కూడా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకనీ బాట లో పయనిస్తున్నారు. గ్రూప్ దాతృత్వ సంస్థ భారతీ ఫౌండేషన్‌కు రూ.7 వేల కోట్లు విరాళంగా ప్రకటించారు. భారతీ కుటుంబం మొత్తం ఆస్తుల్లో 10 శాతం వాటాను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. భారతీ ఎయిర్‌టెల్ కుటుంబానికి చెందిన మూడు శాతం వాటాను దాతృత్వ సంస్థలకు కేటాయించామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గా ల యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం ‘సత్యభారతీ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. ఈ కొత్త యూనివర్సిటీ సైన్సు అండ్ టెక్నాలజీపై దృష్టిసారించనుంది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి వాటికి ప్రాధాన్యమిస్తారు. ఈ యూనివర్సిటీని ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. తొలి అకాడమిక్ సెషన్ 2021 నుంచి ప్రారంభించనుండగా, ఈ వర్సటీలో మొత్తం 10వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని ’ది గివింగ్ ప్లెడ్జ్’కు 50 శాతం ఆస్తులను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ ‘గివింగ్ ప్లెడ్జ్’ను స్థాపించారు. ఆస్తులను దాతృత్వానికి మళ్లించివారి జాబితాలో ఇప్పటికే భారత్ నుంచి బిలియనీర్లు విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా, శోభా లిమిటెడ్ చైర్మన్ పిఎన్‌సి మీనన్‌లు ఉన్నారు. ప్లెడ్జ్‌కు వితరణ దిశగా నిలేకనీ నిర్ణయా న్ని బిల్‌గేట్స్ స్వాగతించారు. నిలేకనీ వ్యాపారవేత్తగా ఎంతో ఆసక్తి కల్గినవారని, ఆయన దాతృ-త్వం వైపు అడుగులు వేయడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. నిలేకని, ఆయన భార్య దాతృత్వానికి అండగా ఉం డడం ఆనందం కల్గిస్తోందని బిల్‌గేట్స్ అన్నారు.