Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

Sunitha Mahender Reddy Speech About TRS Government

మనతెలంగాణ/కోట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు జిన్నారం, ఎన్కేపల్లి, అన్నసాగర్ గ్రామాల్లో  42 లక్షల రూపాయలతో  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌పర్సన్ సునీతా హేందర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ్‌రావులు హాజరై కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కోట్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విశ్వం పంతులు ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు కలిసి విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ సెంటర్లలో కిచన్ రూం మంజూరు చేయాలని అలాగే పాఠశాల కిచన్ రూంకు మరమ్మతులు చేయడానికి నిధులు కేటాయించాలని గ్రామ సర్పంచ్ నిర్మలమల్లేశం చైర్మన్‌ను అడుగగా ఆమె స్పందిస్తూ త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తామని  హమీ ఇచ్చారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ది జరిగిందని ఆమె అన్నారు.

రైతులను అన్ని విధాలుగా ఆదుకుని ఆర్థిక స్తోమతను కల్గించి రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి సాయం అందించిందన్నారు. రైతులను సంతోషంగా ఉంచాలనే ఉద్ధేశంతో ఎకరాకు రూ 4000 వేల చొప్పున రెండు పంటలకు కలిపి 8 వేల రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నారు.  గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాలను రద్దు చేసేందుకు    సహకరించాలన్నారు. గ్రామాల్లో ఇంటి బిల్లులను చెల్లించి గ్రామ పంచాయితీ అభివృద్ధికి సహక  రించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి బిల్లులు చెల్లించడం వల్ల మన గ్రామం అభివృద్ది చెందుతుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజారోగ్యాలను పరిశుభ్రంగా కాపాడుకునే విషయంలో అందరూ వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకోవాలన్నారు.  ఇందుకు     మరుగు దొడ్డికి కావాల్సిన డబ్బులను కేంద్రం, రాష్ట్రం కలిసి 12000 వేల రూపాయలను అందించడం జరుగుతుందని ఆమే అన్నారు. అనంతరం వికారబాద్ ఎమ్మెల్యే సంజీవ్‌రావు మాట్లాడుతూ.. గ్రామాణ ప్రాంతం పిల్లలను మంచిగా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా చదివించాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ది పరుచడంలో ఆలోచించి నిధులను విడుదల చేస్తుందని అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు నిర్మల,జిన్నారం సర్పంచు మల్లేశం,  జిల్లా పశుగాణాభివృద్ది అధ్యక్షుడు నారాయణరెడ్డి, బంట్వారం ఎంపిపి చిప్పె సుజాత, ఎంపిడిఓ క్రిష్ణకుమారి,మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగయ్య, ఉపాధ్యక్షుడు సాయన్న,(సత్యం) ప్రదాన కార్యదర్శి కావాలి వెంకటయ్య, జిన్నారం గ్రామ అధ్యక్షుడు బందెయ్య, మాజీ జెడ్పిటిసి అంజయ్య, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, మాదవ్‌రెడ్డి, మైబు, ప్రేమ్‌కుమార్, బీమయ్య, ప్రభాకర్, నర్సిములుశేట్, శివానతందం, శివకుమార్‌లు  పాల్గొన్నారు.

Comments

comments