Home మెదక్ రైతుబంధు అన్నారు.. ఎరువు ధరలు పెంచారు: సునీతారెడ్డి

రైతుబంధు అన్నారు.. ఎరువు ధరలు పెంచారు: సునీతారెడ్డి

Sunitha Reddy Speech About Against TRS Goverment
నర్సాపూర్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ,మాజి మంత్రి,మెదక్ జిల్లా అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ,ముఖ్య కార్యకర్తల,నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక, అభివృద్ది పేరుతో ఇసుక మాఫియా తెలంగాణగా మార్చేశారని, ప్రజలకు ఇచ్చిన మాటలను తుంగలో తొక్కి, వారి కమీషన్ల కోసం పనులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు . వ్యవసాయానికి పెట్టుబడి సహయం అంటు ఎకరాకు నాలుగు వేలు ఇచ్చి ,విత్తన ఎరువు,ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి , టిఆర్‌ఎస్ నాయకులు వారికి వారే శభాష్ అనుకుంటున్నారని అన్నారు. రైతు బంధులో,రైతు భీమాలో కౌలు రైతులను చిన్న చూపు చూసేల ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు . రైతు మేలు కోరే ప్రభుత్వం అంటు రైతు భీమాలో నిబంధనాలు పెట్టడం సరికాదన్నారు. ఆరున్నర లక్షల జీవిత భీమా అంటున్న తెలంగాణ ప్రభుత్వం , తెలంగాణ వచ్చిన నుండి ఆత్మహత్మ చేసుకున్న రైతులకు ఎంత మందికి డబ్బులు అందజేశారో ప్రభుత్వం చెప్పాలన్నారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తూ,మోసం చేస్తున్నా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ,స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పనున్నారని సునీతారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ : రంజాన్ సందర్భంగా ముస్లీం లకు కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యంలో గురువారం నాడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఒ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లీం సోదరులు పాల్గొని,ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అంజనేయులు గౌడ్,మల్లేశం,యాదగౌడ్,సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.