Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వెబ్ సిరీసే సరైనది

sunny

ఒక పోర్న్‌స్టార్‌కు బాలీవుడ్‌లో సెలబ్రిటీ స్టేటస్ రావడం, మిగిలిన భారతీయ భాషా చిత్రాల్లో అవకాశాలు వెల్లువలా రావడం సన్నీలియోన్‌కు మాత్రమే సాధ్యమైంది. తన అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రాను మార్చుకొని సన్నీలియోన్‌గా గ్లామర్ ప్రపంచంలో మెరుస్తోంది ఈ హాట్‌బ్యూటీ. ఇప్పుడు ఆమె బయోపిక్ వచ్చేస్తోంది. కాకపోతే వెండితెర మీద కాదు వెబ్ సిరీస్‌గా. భారతీయ మూలాలున్న సన్నీ ఎందుకు పోర్న్‌స్టార్‌గా మారింది? ఏ సందర్భంలో ఆమె అడల్ట్‌స్టార్ అయ్యేందుకు మొగ్గుచూపింది వంటి అంశాలు ఈ బయోపిక్‌లో ఉండనున్నాయి. అయితే ఈ బయోపిక్‌లో సన్నీ పాత్రను సన్నీలియానే పోషిస్తోంది. బిగ్‌బాస్ సీజన్-5లో వైల్డ్‌కార్ట్ ఎంట్రీతో ఒక్కసారి దేశ ప్రజలకు సుపరిచితురాలిగా మారింది ఈ భామ. బిగ్‌బాస్ చేస్తే సల్మాన్‌ఖాన్‌ను కలిసే అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో భారత్‌లోకి అడుగుపెట్టిన సన్నీకి ఊహించని రీతిలో ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోకి ప్రవేశించి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. శృంగార తారగా, ఐటమ్‌గర్ల్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. తాజాగా ఆమె చేస్తున్న బయోపిక్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూసిన వారికి ఒక సాధారణ అమ్మాయి పోర్న్‌స్టార్‌గా ఎలా మారిందనేది అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో సన్నీ స్కూల్ డేస్ నుంచి అసలేం జరిగిందన్న విషయాన్ని చూపించనున్నారు. ఈ బ్యూటీ జీవితాన్ని సినిమాగా తీసి ఉంటే బాగుంటుందన్న వాదన వినిపించినా… వెబ్ సిరీసే సరైనదని అంటోంది సన్నీ.

Comments

comments