Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కేరళకు సన్నీ సాయం…

Sunny Leone donates 1200 kg rice and pulses to Kerala

ముంబయి: గత కొన్ని రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు కేరళలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ రూ. 5 కోట్లు ప్రకటించిందనే వార్త  ఈరోజు వరకు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇది మొదట ఎవరు పోస్ట్ చేశారో కానీ..? పబ్లిక్ మాత్రం అది నిజమో, అబద్ధమోనని కొంచెం కూడా ఆలోచించకుండా ఫుల్ గా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. తీరా ఆ వార్త కాస్త ఫేక్ అని తెలింది. కేరళ బాధితులకు తాము అందిస్తున్న సాహయంపై సన్నీ లియోన్ స్పందించింది. తన భర్త డానియెల్ వెబర్, కొందరు బాలీవుడ్ మిత్రులతో కలిసి కేరళకు 1200 కెజిల బియ్యం, పప్పును పంపినట్టు స్పష్టం చేసింది. సన్నీ,తన భర్త కలసి ఈ రోజు కేరళ బాధితుల ఆకలి తీర్చుతున్నామని పేర్కొంది. ఇప్పుడు కేరళ ప్రజలకు ఏమి అవసరమో తమకు తెలుసని ఆమె చెప్పింది. కేరళకు ఇంకా తమ వంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ముంబయిలోని  జుహులో కేరళ బాధితుల కోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, విరాళాలు సేకరించిన సిద్ధార్థ్ కపూర్, ప్రతీక్, సువేద్ లోహియాలు చాలా గొప్పవారంటూ సన్నీలియోన్ ప్రశంసలు కురిపించింది.

Comments

comments