Home తాజా వార్తలు సన్నీలియోన్ మనస్సు దోచుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా..

సన్నీలియోన్ మనస్సు దోచుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా..

 

ముంబయి: బాలీవుడ్ అందాల భామ సన్నీలియోన్ తన అంద చెందాలతో ప్రేక్షకులను కనువిందు చేసి, వారి మనుస్సులను దోచుకుంది. ఇలా తన అభిమానుల గుండెల్లో గుడికట్టుకున్న ఈ భామ మనుస్సును ఓ స్టార్ క్రికెటర్ దోచుకున్నాడట.  ఇటీవల 11వికెట్స్.కామ్ అనే వెబ్‌సైట్ ఇనాగ్యురేషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ.. తనకిష్టమైన క్రికెటర్‌ పేరును బయటపెట్టింది. మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడగ్గా… సన్నీ తనకు మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలా ఇష్టమని చెప్పింది.

‘‘ క్రికెటర్లలో నాకు మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలా ఇష్టం. అతనికి క్యూట్ బేబీ ఉంది. అంతకు మించి ఆయన మంచి ఫ్యామిలీ పర్సన్. జీవాతో కలిసి ఆయన దిగిన ఫోటోలనూ చూశాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి. అందుకే అతనంటే ఇష్టం’’ అని సన్నీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీలియోన్ తమిళంలో వీసీ వడివుడియన్ 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న వీరమహాదేవి సినిమాలో కీ రోల్ పోషిస్తోంది.  హిందీ, తెలుగు, కన్నడ, మళయాళం భాషల్లో ఈ సినిమాను విడుదలకు చేయనున్నారు.