Search
Friday 16 November 2018
  • :
  • :

హ్యాట్రిక్ మిస్

ముంబయి ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి

Mumbai-Indians

ముంబయి: చివరి ఓవర్లలో నితీశ్ రాణా నిలకడగా ఆడి ముంబయిని ఇండియన్స్ జట్టును గెలిపించాడు. ముంబయి జట్టు ఇంకా 8 బంతులు మిగిలి ఉ ండగానే 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మంబయి ఇండియన్స్ జట్టు తలపడింది. అనారోగ్యం కారణంగా సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ యువ సంచలన పేసర్ ముస్తఫిజుర్, విజయ్ శంకర్ తుది జట్టుకు ఎంపికయ్యారు. ముంబయి ఇండియన్స్ జట్టులో మాత్ర ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హోరాహోరి పోరాడి గెలుపొందిన ముంబయి జట్టు కొండంత ఉత్సాహంతో బరిలోకి దిగగా, ఇప్పటి వరకు ఐపిఎల్‌లో రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిచి అజేయంగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌ను కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశయంతో ఆడింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తిరిగి ఫామ్‌లోకి రావడం ముంబయి జట్టును కాస్త కలవరపరిచింది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు.

రోహిత్‌కు ఇది 100వ ఐపిఎల్ గేమ్ కావడం విశేషం. అలాగే లసిత్ మలింగకు కూడా ఇది 100వ ఐపిఎల్ మ్యాచ్. వాంఖడే స్టేడియంలో ఇదివరలో ముంబయి ఇండియన్స్ జట్టు హైదరాబాద్ జట్టుపై రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు ఈ ఇరు జట్ల మధ్య జరిగింది తొమ్మిదవ మ్యాచ్. ఈ రెండు జట్టు ఒకదానిపై మరోటి నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. ఇప్పటికే ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ బౌలింగ్ సత్తాతో నింపాదిగా ఉన్న సన్‌రైజర్స్‌కు ముస్తఫిజుర్ రెహ్మాన్ కూడా అందుబాటులో ఉండడం మరింత బలాన్నిచ్చింది. అతడు మొయిజెస్ హెన్రిక్స్ స్థానంలో ఆడాడు.

ముంబయి జట్టు తరఫున సంచలన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్ బౌలింగ్ చేయగా, హైదరబాద్ జట్టు తరఫున డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగారు. మొదటి ఓవర్లో వికెట్ నష్టపోకుండా హైదరాబాద్ జట్టు కేవలం 2 పరుగులే చేసింది. 4వ ఓవర్‌కు వికెట్ నష్టపోకుండా 17 స్కోరుకు చేరుకుంది. 8 ఓవర్లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయానికి సన్‌రైజర్స్ 52 పరుగుల స్కోరుకు చేరుకుంది. మెక్లెనగన్ తన బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో 9 ఓవర్లో స్కోరు 62కు చేరుకుంది. 10 ఓవర్లయ్యాక హైదరాబాద్ జట్టు 75 స్కోరుకు చేరుకుంది. హర్భజన్ వేసిన బంతిని వార్నర్ రివర్స్ స్వీప్ చేసి థర్డ్‌మ్యాన్ మీదుగా బౌండరీ కొట్టాడు.

ఆ తర్వాత ఇంకా ఒక్క పరుగు చేస్తే అర్ధశతకాన్ని నమోదు చేసే దశలో వార్నర్ 49 పరుగులు చేసి పార్థీవ్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత దీపక్ హుడా బ్యాటింగ్‌కు వచ్చాడు.12 ఓవర్ల తర్వాత హైదరాబాద్ జట్టు 1 వికెట్ నష్టానికి 93కు చేరింది(ధావన్ 34, హుడా 6తో బ్యాటింగ్ చేస్తున్నారు). కృనాల్ పాండ్య తన తొలి ఓవర్ బౌలింగ్‌లోనే 12 పరుగులిచ్చేసరికి స్కోరు 105కు పెరిగింది. హుడా (9)లాంగ్-ఆన్ బౌండరీ కొట్టబోగా పొలార్డ్‌కు క్యాచ్ అవుట్ అయ్యాడు. నాలుగో బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ వచ్చాడు. 15 ఓవర్లు పూర్తయ్యాక రెండో స్ట్రాటజిక్ సమయంలో బంతిని మార్చారు. యువరాజ్‌ను(5/7) పాండ్య క్లీన్‌బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన యార్కర్‌కు కటింగ్ అవుటయ్యాడు. అప్పుడు స్కోరు 146. తర్వాత మలింగ బంతికి విజయ్ శంకర్ 1 పరుగుకే అవుటయ్యాడు. ఆట ముగిసే దశలో మలింగ చక్కగా బౌలింగ్ చేయసాగాడు. బుమ్రా బంతికి ఓజా క్యాచవుట్ అయ్యాడు. జస్పీత్ బుమ్రా హైదరాబాద్ జట్టు 3 వికెట్లు తీసుకున్నాడు. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధారిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఆటను ముగించింది.

హైదరాబాద్ పెట్టిన 159 లక్ష ఛేదనకు ముంబయి ఇండియన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హైదరాబాద్ జట్టు బౌలర్ భువనేశ్వర్ తొలి ఓవర్ బౌలింగ్ చేపట్టగా పార్థీవ్, బట్లర్‌లు ముంబయి జట్టు ఓపెనర్‌లుగా దిగారు . మొదటి ఓవర్లో ముంబయి జట్టు వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. 2 ఓవర్లో ముంబయి 21 పరుగులు చేసింది. కానీ తర్వాత నెహ్రా, బట్లర్(14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. 4 బంతుల్లో 4 పరుగులు చేశాక రోహిత్ రషీద్ బంతికి ఎల్‌బిడబ్లు అయ్యాడు. అప్పుడు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ముంబయి స్కోరు 42గా ఉంది. అప్పటికే 3 బౌండరీలు కొట్టిన పార్థీవ్ టాప్ ఫామ్‌లో ఉన్నట్లు ఆడసాగాడు. కానీ 24 బంతులాడి 39 పరుగుల స్కోరులో ఉండగా హుడా వేసిన బంతికి లాంగ్ ఆన్ బౌండరీ కొట్టబోయి భువి చేతిలో క్యాచ్ అవుటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ముంబయి 3 వికెట్ల నష్టానికి 85 స్కోరులో ఉంది. రాణా తర్వాత స్కాయిర్ వెనుక ఓ కట్ చేసి 35 పరుగులు చేశాడు.

ఈ దశలో ముంబయి గెలిచేందుకు 48 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి. ముస్తఫిజుర్ వేసిన బంతిని పొలార్డ్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత రాణా ఓ సింగిల్ పరుగు తీసుకున్నాడు. దాంతో విజయానికి 42 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ తర్వాత భువి వేసిన బంతిని పొలార్డ్ కొట్టబోయి ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు వేగంగా పడిపోతుండడంతో ముంబయి విజయానికి నితీశ్ రాణా పాత్ర కీలకంగా మారింది. రషీద్ వేసిన ఓ లూజ్ బాల్‌ను కృనాల్ సిక్సర్‌గా కొట్టాడు. దాంతో 30 బంతుల్లో 39 ఛేదించాల్సిన స్థితి నెలకొంది. గెలుపోటముల కీలక దశలో నెహ్రా 13 పరుగులు ఇచ్చాడు. దాంతో ముంబయి 24 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది. బంతిబంతికి ముంబయి ఉత్కంఠ నెలకొంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 158/8(20 ఓవర్లు)
డేవిడ్ వార్నర్(సి)పటేల్(బి)హర్భజన్ సింగ్ 49, శిఖర్ ధావన్ (బి)మెక్లెనగన్ 48 , దీపక్ హుడా(సి) పొలార్డ్(బి) హర్భజన్ సింగ్ 9, యువరాజ్ సింగ్ (బి) హర్దిక్ పాం డ్య 5, బిసిజె కటింగ్(బి)బుమ్రా 20, నమన్ ఓజా(సి)పొలార్డ్(బి)బుమ్రా9, వి.శంక ర్(సి)రాణా(బి)మలింగ 1, రషీద్ ఖాన్(సి అండ్ బి) బుమ్రా 2, భువనేషశ్వర్ కుమా ర్(నాటౌట్) 4, ఎ. నెహ్రా(నాటౌట్)0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం:158, వికెట్ల పతనం: 1-81, 2-105, 3-114,4-123,5-146, 6-147, 7-153, 8-155, బౌలింగ్: హర్భజన్ సింగ్ 4-0-23-2, ఎస్‌ఎల్ మలింగ 4-0-30-1, జెజె బుమ్రా 4-0-24-3, మెక్లెనగన్ 4-0-42-1, హెచ్‌హెచ్ పాండ్య 3-0-22-1, కెహెచ్ పాండ్య 1-0-12-0.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: 159/6(18.4 ఓవర్లు)
పార్థివ్ పటేల్(సి) కుమార్(బి) హుడా 39 , బట్లర్ (బి) నెహ్రా 14, నితీశ్ రాణా (బి) కుమార్ 45 , రోహిత్ శర్మ ఎల్‌బిడబ్లు(బి)రషీద్ ఖాన్ 4 , కె హెచ్ పాండ్య , పొలార్ ్డ (సి) ధావన్(బి)కుమార్ 11 , కృనాల్ పాండ్య (సి) కటింగ్(బి)కుమార్ 37 , హర్భజన్‌సింగ్ (నాటౌట్) 3, హెచ్.హెచ్ పాండ్య (నాటౌట్) 2ఎక్స్‌ట్రాలు:….మొత్తం:…వికెట్ల పతనం: 1-28, 2-41,3-79, 4-111,5-149,6-155, బౌలింగ్: భువనేశ్వర్ కుమార్4-0-21-3 , నెహ్రా 4-0-46-1, రషీద్ ఖాన్4-0-19-1 , ముస్తఫిజుర్ రెహ్మాన్ 2.4-0-34-0, డిజె హుడా2-0-18-1 , కటింగ్2-0-18-0 ,

Comments

comments