Search
Sunday 18 November 2018
  • :
  • :

కీలక మ్యాచ్‌లో తడబడ్డ ఎస్‌ఆర్‌హెచ్!

Warner-Williamson

బెంగళూరు : ఐపిఎల్ -10 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడింది. కోల్‌కత జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 128 పరుగలకు పరిపితమైంది. హైదరాబాద్ బ్యాటింగ్‌లో వార్నర్ 37, విలియమ్సన్ 24, శంకర్ 22 పరుగులు చేశారు. మిగితా ఆటగాళ్లు స్వల్ప పరుగులకే పరిమితమయ్యారు. కోల్‌కత్తా బౌలింగ్‌లో కౌంటర్ నైల్ 3, ఉమేశ్ యాదవ్ 2, బౌల్ట్, చావ్లా చెరో వికెట్ తీశారు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ అనంతరం వర్షం రావడంతో కోల్‌కతా బ్యాటింగ్ ప్రారంభించడానికి స్వల్ప అంతరాయం ఏర్పడింది.

Comments

comments