Search
Monday 24 September 2018
  • :
  • :

సన్‌రైజర్స్‌కు మరో పరాజయం

SRH-VS-KKR-Lost

కోల్‌కతా : ఐపిఎల్ 10 సీజన్ లో సన్‌రైజర్స్ జట్టు మరోసారి ఓటమి పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌  17 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు తొలుత కాస్త కట్టుదిట్టంగానే బౌలింగ్ వేసి పరుగులు కట్టిడి చేసినా, ఊతప్ప (68), పాండే (41) పరుగులతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి 173 పరుగుల విజయ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందుంచింది.

173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆటగాళ్లు లక్ష్య చేధనలో విఫలమయ్యారు. ఓపెనర్లు వార్నర్ (26), ధావన్ (23), యువరాజ్ (26) మినహా మిగితా ఆటగాళ్లు స్వల్ప స్కోర్ లకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌  17 తేడాతో విజయం సాధించింది.

Comments

comments