Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రైజర్స్‌కు చావోరేవో!

  • నేడు ముంబైతో కీలక పోరు

SRH

హైదరాబాద్: సొంతగడ్డపై పుణె చేతిలో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అయితే కిందటి మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చతికిలపడ్డ వార్నర్ సేనకు ఈ మ్యాచ్ పరీక్షగా మారింది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకోగా, హైదరాబాద్ వరుస ఓటములతో తన అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఢిల్లీ, పుణె చేతుల్లో ఎదురైన ఓటమి హైదరాబాద్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అయితే ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వం ఒడ్డాలని హైదరాబాద్ భావిస్తోంది. కిందటి మ్యాచుల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలనే పట్టదలతో ఆరేంజ్ సేన ఉంది.
వార్నర్‌పైనే భారం..
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారమంత కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. వార్నర్ మెరిస్తే హైదరాబాద్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. ఈ సీజన్‌లో ఇప్పటికే అత్యధిక పరుగులు సాధించిన క్రికెట ర్‌గా నిలిచిన వార్నర్ కొన్ని మ్యాచ్‌ల నుంచి సరిగ్గా ఆడడం లేదు. అతని వైఫల్యం పుణె మ్యాచ్‌లో స్పష్టం గా కనిపించింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఎంతైన ఉంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన బ్యాట్‌కు పని చెపాల్సి ఉంది. అద్భుత ఫాంలో ఉన్న ధావన్ నుం చి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక, సీనియర్లు కానె విలియమ్‌సన్, యువరాజ్ సింగ్‌లు కూడా దూకుడు మీదున్నారు. కిందటి మ్యాచ్‌ల్లో యువరాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా యువీ మెరుగ్గా ఆడక తప్పదు. అతను చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. విలియమ్‌సన్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ఆటగాళ్లకు హైదరా బాద్‌లో కొదవలేదు. అయితే సమస్టిగా రాణించక పోవడంతో జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఈ మ్యాచ్ లోనైనా కలిసి కట్టుగా ముందుకు సాగాల్సి ఉంది. ఇక, బౌలింగ్‌లో హైదరాబాద్‌కు ఎదురే లేదు. భువనే శ్వర్, రాషెద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ తదితరులతో బౌలింగ్ బలోపేతంగా ఉంది. భువనేశ్వర్ ఇప్పటికే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సీనియర్ బౌలర్ ఆశీష్ నెహ్రా గాయం వల్ల ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను నెలకొన్న బౌలింగ్ వనరులకు కొదవలేదు. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్ ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. పొలార్డ్, సిమన్స్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి అగ్రశ్రేణా ఆల్‌రౌండర్లు ముంబైకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక, కెప్టెన్ రోహిత్ శర్మ, పార్థివ్ పటేల్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది.

Comments

comments