Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రైజర్స్ వర్సెస్ నైట్‌రైడర్స్

  • 17న క్వాలిఫయర్-2

KKR-Vs-SRH

హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-2లో మాజీ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడి యంలో ఈ పోరు జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1 ఓటమి పాలైన జట్టుతో తలపడతుంది. క్వాలిఫయర్-2లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో జరిగే మ్యాచ్ హైదరాబాద్‌కు కీలకంగా మారింది. చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసి ప్లేఆఫ్‌కు దూసుకొచ్చిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్ 20 పాయింట్లతో మొదటి స్థానం లో నిలిచింది. పుణె 18 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ 17 పాయిం ట్లతో మూడో స్థానాన్ని సాధించింది. కాగా, కోల్‌క తాతో జరిగే మ్యాచ్‌లో గెలిచి టైటిల్ రేసులో నిలు వాలనే పట్టుదలతో హైదరాబాద్ ఉంది. ఇందులో విజయం సాధిస్తే మరోసారి ట్రోఫీని గెలుచుకునే అవ కాశాలు మెరుగు పడుతాయి. వరుస ఓటములతో డీలా పడ్డ కోల్‌కతాతో పోల్చితే హైదరాబాద్ బలో పేతంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగా ల్లో వార్నర్ సేన చాలా పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీం తో కోల్‌కతా మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని హైదరాబాద్ భావిస్తోంది. కొత్త కుర్రాడు విజయ్ శంకర్ గుజరాత్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడ డంతో జట్టు బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఓజా, హెన్రిక్స్ తదితరులతో కూడిన బ్యాటింగ్ లైనప్ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం. అంతేగాక, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ తదితరులతో కూడిన బౌలింగ్‌తో కోలకతా బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పక పోవచ్చు. కాగా, ముంబైలో మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్-రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతాయి. ఇందులో గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుం టుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 విజేతతో తలపడాల్సి ఉంటుంది.

Comments

comments