Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పుణె చేతిలో సన్‌రైజర్స్ ఓటమి

Pune-vs-Hyderabad

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా పుణెతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. టాస్ గెలిచి పుణెను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన హైదరాబాద్ చక్కటి బౌలింగ్‌తో సూపర్‌జెయింట్‌ను 148 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం 149 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 136 పరుగులకే పరిమితమైంది.

దీంతో పుణె 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో వార్నర్(40), యువరాజ్ సింగ్(47) పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు చేతులేత్తేయడంతో సన్‌రైజర్స్ ఓటమి చవిచూసింది. ఐదు వికెట్లు పడగొట్టి పుణె విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Comments

comments