Search
Wednesday 14 November 2018
  • :
  • :

వారెవ్వా.. వార్నర్

  • సెంచరీతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ కెప్టెన్
  • కోల్‌కతా నైట్‌రైడర్స్ పై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్

 

Untitled-2

హైదరాబాద్ : ఢిపెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సెంచరీతో పరుగుల సునామీ సృష్టించాడు. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుని హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన వార్నర్, శిఖర్ ధావన్ మంచి శుభారంభాన్ని అందించారు. వార్నర్ మాత్రం మెరుపువేగంతో సన్‌రైజర్స్ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ప్రత్యర్థుల బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు. ఆది నుంచి నిలకడగా ఆడిన హైదరాబాద్ సారథి (59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్) 126 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మరో ఓపెనర్ ధావన్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) 29 పరుగులు చేసి తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ధావన్ స్థానంలో వచ్చిన విలియమ్సన్ వార్నర్‌కు జోడీగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతనిదూకుడుకు కోల్‌కతా బౌలర్ వోక్స్ కళ్లెం వేయడంతో వార్నర్‌కు బ్రేక్ పడింది. ఫలితంగా వోక్స్ బౌలింగ్‌లో గంభీర్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ నిష్క్రమించాడు. విలియమ్సన్ (40) పరుగులతో రాణించగా, యువరాజ్ సింగ్ (4) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిన సన్‌రైజర్స్, ప్రత్యర్థి కోల్‌కతాకు 210 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

ఛేదనలో కోల్‌కతా విఫలం 
210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విఫలమైంది.  తొలుత ఓపెనర్లుగా వచ్చిన నరేన్ (1), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (11) పరుగులతో ఆదిలోనే చేతులేత్తేశారు. అనంతరం ఉతప్ప (53), మనీశ్ పాండే (39) పరుగులు ఔట్ అయ్యారు. వీళ్లు మినహా మిగితా ఆటగాళ్లు అంతా స్వల్ప పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది.

1000 పరుగులు చేసిన వార్నర్
విధ్వంసక బ్యాటింగ్‌తో ఉప్పల్ మైదానంలో భారీ షాట్లతో రెచ్చిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో నాల్గో బంతిని బౌండరీకి పంపే క్రమంలో ఈ మైలురాయిని వార్నర్ అందుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సారథి వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఉప్పల్ మైదానంలోని అభిమానులను అబ్బురపరిచేలా భారీ షాట్లతో విజృంభించి సెంచరీని దాటేశాడు.

Comments

comments