మొహాలి: వేదికగా పంజాబ్‌తో జరిగిన ఐపిఎల్ 33వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. 208 పరుగుల భారీ లక్ష ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దాంతో హైదరాబాద్ 26 పరుగులతో తేడాతో పంజాబ్‌పై గెలిచింది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో షాన్ మార్ష్(86) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. గుప్టిల్(23), మోర్గాన్(26), అక్షర్ పటేల్(16), అనురీత్ సింగ్(15) రెండెకల స్కోర్ చేశారు. హైదరాబాద్ బౌలర్లలో నెహ్రా, కౌల్ తలో 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ 2, రషిద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైరదాబాద్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్(77), వార్నర్(51), విలియమ్సన్(54) పరుగులు చేశారు. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చిన హైదరాబాద్ బౌలర్ రహిద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.