Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వార్నర్ ఒంటరిపోరాటం!

సన్‌రైజర్స్ ఘనవిజయం   వోహ్రా సెంచరీ మిస్..  పంజాబ్ ఓటమి 

Warner

హైదరాబాద్: ఐపిఎల్ 10వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సోమవారమిక్కడ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష ఛేదనలో పంజాబ్ ఆటగాడు ఆది నుంచి అద్భుత ప్రదర్శనతో వోహ్రా (95) హాఫ్ సెంచరీ సాధించి ఎల్‌బిడ బ్లుగా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ కావడంతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో వార్నర్ సేనకు 2 పాయింట్లు దక్కాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (54 బంతు ల్లో 7 ఫోర్లు, 2 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్ (70) హాఫ్ సెంచరీతో విజృం భించాడు.

తొలుత టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. తొలుత ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ స్కోరు చేశాడు. వార్నర్ ఒంటిరిపోరాటం చేస్తూ అజేయంగా నిలిచాడు. శిఖర ధావన్ (15) పరుగులకే చేతులేత్తేశాడు. అనంతరం హెన్రిక్స్ (9), యువరాజ్ సింగ్ ఖాతానే తెరవలేదు. ఓజా (34), హుడా (12), నబీ (2), రషీద్ ఖాన్ (6) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 159 పరుగులు చేసి పంజాబ్‌కు 160 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో అక్సర్ పటేల్, మోహిత్ శర్మ రెండు వికెట్లు, సందీప్, కరియప్ప తలో వికెట్ తీసుకున్నారు. 161 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే తడబడగా, ఓపెనర్ ఆమ్లా ఖాతా తెరవనే లేదు. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (10), మిల్లర్ (1), సాహా (0), మోర్గాన్ (13), అక్సర్ పటేల్ (7), మోహిత్ (10), కరియప్ప (1), ఇషాంత్ శర్మ (2) పరుగులకే నిష్క్రమించారు. సందీప్ (5) నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌కు ఐదు వికెట్లు, రషీద్ రెండు వికెట్లు, నబీ, హెన్రిక్స్ తలో వికెట్ తీసుకున్నారు. సన్‌రైజర్ బౌలర్ భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ :వార్నర్ నాటౌట్ ; 70, ధావన్ (సి) సాహా (బి) మోహిత్ శర్మ; 15, హెన్రిక్స్ స్టంప్ సాహా (బి) పటేల్; 9, యువరాజ్ సింగ్ (సి) సాహా (బి) పటేల్; 0, ఓజా స్టంప్ సాహా (బి) కరియప్ప; 34, హుడా (సి) సందీ ప్ (బి) మోహిత్; 12, నబీ (సి) మిల్లర్ (బి) సందీప్; 2, రషీద్ ఖాన్ నాటౌట్ ; 6. ఎక్స్‌ట్రాలు: 11. మొత్తం: (20 ఓవర్లలో 6 వికె ట్లు) 159 పరుగులు. వికెట్ల పత నం: 1-25, 2-50, 3-50, 4-110, 5-140, 6-146.

పంజా బ్ బౌలర్లు : సందీప్ 4-0-35-1, ఇషాంత్ 4-0-23-0, కరియప్ప 4-0-38-1, అక్సర్ పటేల్ 4-0-33-2.
పంజాబ్ జట్టు ఇన్నింగ్స్: హాసీమ్ ఆమ్లా ఎల్‌బిడబ్లు (బి) కుమార్ ; 0, వోహ్రా ఎల్‌బిడబ్లు (బి) కుమార్; 95, మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) కుమార్ ; 10, మోర్గాన్ (బి) నబీ ; 13, మిల్లర్ (బి) రషీద్ ఖాన్; 1, సాహా (బి) రషీద్ ; 0, అక్సర్ పటేల్ (సి) ధావన్ (బి) హెన్రిక్స్ ; 7, మోహిత్ (సి) ధావన్ (బి) కుమార్; 10, కరియప్ప (బి) కుమార్ ; 1, ఇషాంత్ (బి) కౌల్ ; 2, సందీప్ నాటౌట్ ; 5. ఎక్స్‌ట్రాలు : 10. మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్) 154 పరుగు లు. వికెట్ల పతనం: 1-0, 2-16, 3-57, 4-62, 5-62, 6-82, 7-127, 8-144, 9-145, 10-154. హైదరాబాద్ బౌలర్లు: భువనేశ్వర్ కుమార్ 4-0-19-5, బిరేందర్ శ్రాన్ 2-0-29-0, కౌల్ 3.4-0-26-1, నబీ 4-0-28-1, రషీద్ ఖాన్ 4-0-42-2, హెన్రిక్స్ 2-0-6-1.

Comments

comments