Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సిరాజ్ ధాటికి తోక ముడిచిన లయన్స్

Siraj

 

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యువ బౌలర్ మహ్మద్ సిరాజ్  నాలుగు వికెట్లు తీసి గుజరాత్ లయన్స్ తోక ముడిచి పారిపోయేలా చేశాడు. ఇషాన్ కిషన్, రైనా, ఫాల్కనర్, సంగ్వాన్ లను ఔట్ చేసి తీసి కొలుకోలేని దెబ్బకొట్టాడు.  సిరాజ్ దెబ్బకు లయన్స్ 154 పరుగులకే కుప్పకూలిపోయింది.  తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 19.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో వార్నర్ (67), శంకర్ (63) పరుగులు చేశారు. వార్నర్, శంకర్ 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సన్ రైజర్స్  రెండు వికెట్లు కోల్పోయి (158)  లయన్స్ విధించిన లక్ష్యాన్ని చేధించింది. దీంతో లయన్స్ పై  ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది. సన్ రైజర్స్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Comments

comments