Home ఛాంపియన్స్ ట్రోఫీ సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ…

సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ…

Sunrisers-Hyderabad

హైదరాబాద్: వేదికగా గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపిఎల్ 10వ సీజన్‌లోని ఆరో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు చేసింది. దాంతో హైదరాబాద్ 136 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా టార్గెట్‌ను చేధించింది.

సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్(76), హెన్రీక్స్(52) అజేయ అర్ధ శతకాలతో రాణించారు. గుజరాత్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఘోరంగా విఫలమైంది. దాంతో ఈ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. మరోవైపు హైదరాబాద్ వరుసగా రెండు విజయాలతో డిపెండింగ్ ఛాంపియన్‌గా అదరగొడుతోంది. ఇక తన అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ స్పిన్నర్ రషిద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.