Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సన్ ‘రైజింగ్’

  • చెలరేగిన బౌలర్లు, రాణించిన ధావన్, ముంబైకు హైదరాబాద్ షాక్

SRH-Won

హైదరాబాద్: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టమైన ముంబై ఇండియన్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగు లు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 18.2 ఓవర్లలోనే కేవ లం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. డేవిడ్ వార్నర్ (6) విఫలమైన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భు త బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించా డు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 46 బంతు ల్లో 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెన్రిక్స్ ఆరు ఫోర్లతో 44 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు.
ప్రారంభం నుంచే..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎం చుకున్న ముంబై ఇండియన్స్‌కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టు దిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా మహ్మద్ నబి అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతి ప్పలు పెట్టాడు. ప్రమాదకర ఆటగాడు సిమ న్స్(1) తన తొలి ఓవర్‌లోనే పెవిలియన్ పం పించాడు. మరోవైపు సిద్ధార్థ్ కౌల్ కూడా ని ప్పులు చెరిగాడు. పిచ్ నుంచి లభించిన సహ కారాన్ని సద్వినియోగం చేసుకున్న కౌల్ ముంబై ఆటగాళ్లను హడలెత్తించాడు. ఈ క్రమంలో నితీష్ రాణా (9), పార్థివ్ పటేల్ (23)లను పెవిలియన్ పంపించాడు. దీంతో ముంబై 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుది.
రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టె న్ రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు. హార్ధిక్ పాండ్యాతో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుం టూనే చెత్త బంతులను బౌండరీలుగా మలిచా డు. మరోవైపు హైదరాబాద్ బౌలర్లు కూడా చక్కని లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ పరుగుల వేగాన్ని నియంత్రించారు. సమన్వ యంతో ఆడిన పాండ్యా (15)ను రాషెద్ ఖాన్ పెవిలియన్ బాట పట్టించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే 67 పరుగులు చేసిన రోహిత్ స్కోరును పెంచే క్రమంలో వెనుదిరిగాడు. కుదురుగా ఆడుతున్న రోహిత్ అద్భుత బంతితో కౌల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు. దీంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. రైజర్స్ బౌలర్లలో కౌల్ మూడు, భువనేశ్వర్ రెండు వికెట్లు తీశారు.
స్కోరుబోర్డు:
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: లెండిల్ సిమన్స్ (బి) మహ్మద్ నబి 1, పార్థివ్ పటేల్ (సి) వార్నర్ (బి) సిద్దార్థ్ కౌల్ 23, నితీష్ రాణా (సి) భువనేశ్వర్ (బి) కౌల్ 9, రోహిత్ శర్మ (బి) కౌల్ 67, హార్ధిక్ పాండ్యా (సి) హెన్రిక్స్ (బి) రాషెద్ ఖాన్ 15, పొలార్డ్ (సి) శంకర్ (బి) భువనేశ్వర్ 5, కరణ్ శర్మ (సి) ఓజా (బి) భువనేశ్వర్ కుమార్ 5, హర్భజన్ సింగ్ నాటౌట్ 1, మెక్లెనగాన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు10, మొత్తం 20 ఓవర్లలో 138/7.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-29-2, మహ్మద్ నబి 4-0-13-1, మహ్మద్ సిరాజ్ 3-0-32-0, సిద్ధార్థ్ కౌల్ 4-0-24-3, రాషెద్ ఖాన్ 4-0-22-1, హెన్రిక్స్ 1-0-15-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ ఎల్బీ-బి మెక్లెనగాన్ 6, శిఖర్ ధావన్ నాటౌట్ 62, హెన్రిక్స్ 44, యువరాజ్ సింగ్ (సి) పాండ్యా (బి) మలింగ 9, విజయ్ శంకర్ నాటౌట్ 15, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం 18.2 ఓవర్లలో 140/3.
బౌలింగ్: హర్భజన్ 4-0-23-0, మెక్లె నగాన్ 4-0-26-1, మలింగ 4-0-33-1, బుమ్రా 3.2-0-24-1, కరణ్‌శర్మ 2-0-19-0, హార్ధిక్ పాండ్యా 1-0-13-0.

Comments

comments