Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అదరహో విలియమ్సన్.. ధనాధన్ ధావన్..

ఐపిఎల్ 10 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల బాటలో పయనిస్తోంది. ఢిల్లీ డేర్‌డేవిల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్‌గా దిగిన ధావన్ దుమ్మురేపగా, విలియమ్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో మరో విజయాన్ని సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విలియ మ్సన్ ఢిల్లీ ఆటగాళ్లను ఊచకోత కోశాడు. క్రిస్ మోరిస్ రాణిం చడంతో వీరిద్దరి దూకుడుకు బ్రేక్ పడింది. మోరిస్ ఒక్క డే కీలకమైన 4 వికెట్లు తీసి  కట్టడి చేసి నప్పటికీ విజయం సన్‌రైజర్స్‌నే వరించింది. 

Sunrisers

హైదరాబాద్: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో బుధ వారం ఇక్కడ ఉప్పల్ వేదిక గా రాజీవ్ గాంధీ ఇంటర్నే షనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో మరో విజయాన్ని సాధించింది. లక్ష ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో సన్‌రైజర్స్‌కు 2 పాయింట్లు దక్కాయి. ఆట గాడు విలియమ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపో యాడు. (51 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) 89 పరుగులు సాధించి హాఫ్ సెంచరీని దాటేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) 70 పరుగులతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ ఆది నుంచి నిలకడగా ఆడు తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ఢిల్లీ బౌలర్లను ఊచ కోత కోశారు.

ఇద్దరూ రెండో వికెట్‌కు 68 బంతుల్లో 100 పరు గులు జోడించారు. 16.1 ఓవర్‌లో బౌలింగ్ అందుకున్న మోరిస్ విలి యమ్సన్ దూకుడుకు కళ్లెం వేయడంతో శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. ధావన్ కూడా అదే తరహాలో దూకుడుగా ఆడగా, ఢిల్లీ బౌలర్ మోరిస్ 18.1 ఓవర్‌లో కట్ట డి చేయడంతో ధావన్ మ్యాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వచ్చిన సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ (3) పరుగులకే చేతులేత్తేశాడు. సన్‌రైజర్స్ కీలకమైన నాలుగు వికెట్లను బౌలర్ మోరిస్ తీయగా, 170 స్కోరు వద్ద హైదరాబాద్ జట్టు వెంటవెంటనే రెండు వికె ట్లు కోల్పోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన డేవిడ్ వార్నర్ గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగి వీరంగం సృష్టించగా, ఈ మ్యాచ్‌లో కేవ లం (4) పరుగులకే చేతులేత్తేశాడు.

మిగతా ఆటగాళ్లలో హెన్రిక్స్ (12), హుడా (9) పరుగులతో క్రీజులో నాటౌట్‌గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్టానికి సన్‌రైజర్స్ జట్టు 191 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి ఢిల్లీ జట్టుకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ ఆటగాడు విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

లక్ష ఛేదనలో ఢిల్లీ కుదేలు: 192 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ఢిల్లీడేర్‌డెవిల్స్ జట్టు ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ (13) పరుగులకే నిష్క్ర మించాడు. మరో ఓపెనర్ ఆటగాడు సంజు శామ్సన్ ఆది నుంచి నిల కడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. సిరాజ్ బౌలిం గ్‌లో హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్)తో 42 పరుగులతో వెనుదిరిగాడు. బిల్లింగ్స్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ (33), రిషబ్ పంత్ (0), మ్యాథ్యూస్ (31) పరుగులు చేయ గా, శ్రేయాస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచా డు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి ఢిల్లీ జట్టు 176 పరుగులు చేసింది.

మెరిసిన క్రిస్ మోరిస్..: సన్‌రైజర్స్ ఆటగాళ్లు ధావన్, విలియ మ్సన్ అద్భుత ఇన్నింగ్స్‌తో పరుగుల సునామీ సృష్టిం చగా, వారిద్దరిని ఢిల్లీ బౌలర్ క్రిస్ మోరిస్ తనదైన బౌలింగ్ శైలితో విడగొ ట్టేశాడు. ముందుగా ఓపెనర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన మోరిస్.. అతన్ని స్వల్ప స్కోరుకే పరిమితం చేశాడు. ఆది నుంచి పరుగుల సునామీ సృష్టించిన విలియమ్సన్, ధావన్‌లకు కళ్లెం వేసేందుకు 16వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్ మోరిస్ బౌలింగ్ అందుకున్నాడు. 18.1 ఓవర్‌లో మోరిస్ బౌలింగ్ వేయగా మ్యాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ (70) పరుగులకే ఔటయ్యాడు. అనంతరం యువరాజ్ సింగ్ ను (3) క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపేశాడు. దీంతో సన్‌రైజర్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టి భారీ స్కోరు చేయనీయకుండా అడ్డుకట్టవేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) మిశ్రా (బి) మోరిస్ ; 4, శిఖర ధావన్ నాటౌట్ ; 56, విలియమ్సన్ (సి) అయ్యర్ (బి) మోరిస్ ; 89, యువరాజ్ సింగ్ (బి) మోరిస్ ; 3, హెన్రిక్స్ నాటౌట్; 12, హుడా నాటౌట్ ; 9. ఎక్స్‌ట్రాలు: 4. మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లు) 191 పరుగులు. వికెట్ల పతనం: 1-12, 2-148, 3-170, 4-170. ఢిల్లీ బౌలర్లు : జయంత్ యాదవ్ 2-0-16-0, మోరిస్ 4-0-26-4, జహీర్ ఖాన్ 4-0-37-0, కమిన్స్ 4-0-37-0, మ్యాథ్యూస్ 3-0-41-0, అమిత్ మిశ్రా 3-0-33-0.

ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ : సంజు శామ్సన్ (సి) హెన్రిక్స్ (బి) సిరాజ్ ; 42, శామ్ బిల్లింగ్స్ (సి) హుడా (బి) సిరాజ్ ; 13, కరుణ్ నాయర్ రనౌట్ (సబ్ (వి శంకర్, యువరాజ్ సింగ్) ; 33, రిషబ్ పం త్ (సి) వార్నర్ (బి) యువరాజ్ సింగ్ ; 0, శ్రేయాస్ అయ్యర్ నాటౌ ట్; 50, మ్యాథ్యూస్ (సి) సబ్ (జార్దన్) (బి) కౌల్; 31. ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లు) 176 పరుగులు. వికెట్ల పతనం: 1-14, 2-85, 3-86, 4-105, 5-175. సన్‌రైజర్స్ బౌలర్లు : భువనేశ్వర్ కుమార్ 4-0-29-0, మహ మ్మద్ సిరాజ్ 4-0-39-2, సిద్ధార్థ కౌల్ 4-0-32-1, రషీద్ ఖాన్ 4-0-33-0, హెన్రిక్స్ 3-0-32-0, యువరాజ్ సింగ్ 1-0-6-1.

Comments

comments